- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రేపు కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ : టీపీసీసీ చీఫ్

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) నేతృత్వంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కుల గణనన(BC Cast Census), ఎస్సీ వర్గీకరణ(SC Reservations) వంటి బృహత్తర కార్యక్రమాలపై సమగ్ర సమాచారం ఇవ్వాలని టీపీసీసీ(TPCC) నిర్ణయించింది. దీనిలో భాగంగా శుక్రవారం కుల గణన, వర్గీకరణపై నేతలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్(Power Point Presentation) ఇవ్వనున్నది. టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్(Mahesh Kumar Goud) ఆధ్వర్యంలో గాంధీ భవన్ లోని ప్రకాశం హల్ లో మధ్యాహ్నాం 2 గంటలకు ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకుగాను ముఖ్యఅతిథులుగా సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ(Deepa Das Munshi) పాల్గొంటున్నారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణలపై కాంగ్రెస్ నేతలకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ మంత్రి దామోదర్ రాజా నర్సింహ, సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవితో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ హాజరై ప్రజెంటేషన్ చేయననున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజక వర్గ బాధ్యులు, పోటీ చేసిన అభ్యర్థులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, డీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యే లు, కార్యవర్గ ప్రతినిధులు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని టీపీసీసీ ఛీప్ విజ్ఞప్తి చేశారు. అలాగే, జిల్లాలోని సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు అందరూ విధిగా పాల్గొనేలా డీసీసీ అధ్యక్షులు బాధ్యత తీస్కొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ కోరారు.