- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: MLC కవిత విచారణ వేళ హైదరాబాద్‌లో పోస్టర్ల కలకలం
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరువుతున్న వేళ హైదరాబాద్‌లో పోస్టర్ల, ఫ్లెక్సీలు కలకలం రేపాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ ద్వారా బీజేపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతుందంటూ నగరంలో పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. కాగా, ఈ పోస్టర్లలో బీజేపీలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ పలువురు బీజేపీ నేతల ఫోటోలతో పోస్టర్లు శనివారం ప్రత్యక్షమయ్యాయి.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు సీబీఐ, ఈడీ రెయిడ్స్ జరగగానే.. కాషాయరంగు పూసుకుని బీజేపీలో చేరిపోయారంటూ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ప్రస్తుత కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ, వెస్ట్ బెంగాల్ బీజేపీ ముఖ్య నేత సువేంధు అధికారి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణె ఫొటోలతో పోస్టర్లు ఉండగా.. వీరంతా రైడ్స్ జరగగానే బీజేపీలో చేరడంతో వీరిపై ఉన్న అవినీతి మరకలు తొలిగిపోయాయంటూ అర్థం వచ్చేలా ఉన్న పోస్టర్లు వెలుగు చూశాయి.
కానీ ఎమ్మెల్సీ కవిత రెయిడ్స్‌కి ముందు తర్వాత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారంటూ అర్థం వచ్చేలా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు, పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. నిజమైన రంగులు ఎప్పటికి వెలసిపోవు అంటూ కొటేషన్‌తో వెలిసిన ఈ పోస్టర్లు కవిత ఈడీ విచారణ వేళ ఆసక్తికరంగా మారాయి. అంతేకాకుండా ఈ పోస్టర్ల చివర్లో బై బై మోడీ అంటూ హాష్ టాగ్‌తో ఉన్న పోస్టర్లు హాట్ టాపిక్‌గా మారాయి.
Read more: