కబ్జాలపై కన్నెర్ర.. ఆక్రమణ కూల్చివేత, స్వాధీనం

by Sathputhe Rajesh |   ( Updated:2024-01-01 03:36:31.0  )
కబ్జాలపై కన్నెర్ర.. ఆక్రమణ కూల్చివేత, స్వాధీనం
X

ఖమ్మంలో కబ్జాల పర్వంపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. దానిలో భాగంగానే నగరంలో కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య, నాగరాజు ఆక్రమించిన 415గజాల స్థలంలో నిర్మించిన రేకుల షెడ్డును అధికారులు కూల్చివేసి కేసు నమోదు చేశారు. అంతేకాక మరికొన్ని చోట్ల ఆక్రమణల్లో చేపట్టిన నిర్మాణాలను అధికారులు, అధికార పార్టీ నాయకులు గుర్తించి, వాటిపై చర్యలు తీసుకోవడం కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. కాగా ఈ ఆక్రమణల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రధాన పాత్ర, సూత్రదారులుగా ఉన్నట్లు తెలుస్తున్నది.

దిశ, ఖమ్మం సిటీ:

ఖమ్మంలో కబ్జాల పర్వం పై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అపార్టీలో నాయకులు, ప్రజాప్రతినిధులు అధికారులు కబ్జాల్లో ప్రధాన పాత్రదారులుగా సూత్రదారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా ఖమ్మం నగరంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దృష్టి సారించింది. దానిలో భాగంగానే ఖమ్మం నగరంలో కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య, నాగరాజు ఆక్రమించిన 415 గజాల స్థలంలో నిర్మించిన రేకుల షెడ్డుని అధికారులు కేసు నమోదు చేసి, ఆ నిర్మాణం కూల్చివేశారు.

అంతే కాక మరి కొన్ని చోట్ల అక్రమణలో ఉన్న నిర్మాణాలను అధికారులు, అధికారపార్టీ నాయకులు గుర్తించి వాటిపై ఆదివారం చర్యలు తీసుకోవడం కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. అంతేకాక మమత రోడ్డులో అక్రమణలో ఉన్న కార్పొరేటర్ చిరుమామిళ్ల నాగేశ్వరరావుకు సంబంధించిన కట్టడానికి మార్కింగ్ పెట్టారు. మమత హాస్పిటల్ పక్కనే ఉన్న టీవీ బాబుకు సంబంధించిన 340 గజాలకుపైగా ఉన్న స్థలంలో నాలుగు అంతస్తుల బారీ భవనంకు గతం లో ఉన్న నగరపాలక సంస్థ కమిషనర్ సందీప్ జా అక్రమ కట్టడం గుర్తించి 2015లోనే నోటీసులు ఇచ్చి కూల్చేయడానికి ఆదేశాలు జారీచేసినా అధికార పార్టీ అండతో కొనసాగించినట్లు ఆరోపణలు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి.

ఖమ్మం నగరంలోని గొల్లగూడెం రోడ్డులో ఎన్సీపీ కాలువను కొంతమంది అధికారులు నాటి ప్రజాప్రతినిధులు కలిసి వందల గజాల భూములు అక్రమాలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిటైర్డ్ తహసీల్దార్ కోలేటి ఆంజనేయులు 300గజాల స్థలం ఆక్రమణ చేసినట్లు తెలుస్తున్నది. అంతేకాక మున్సిపల్ కార్పోరేషన్ డీఈ స్వరూప రాణి కబ్జాలో ఉన్నట్లు సమాచారం. 12వ డివిజన్ కార్పొరేటర్ భర్త 35 గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి పక్కన 65 గజాల కాలువను అక్రమించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆక్రమణలను కలెక్టర్ గుర్తించి వాటిని వెంటనే కూల్చివేసి, ప్రభుత్వం స్వాధీన పరుచుకోవాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story