- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ponnam: ప్రజలకు ధన్యవాదాలు.. ఏడాది పాలనపై మంత్రి పొన్నం ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పడి ఈ రోజుతో ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తి అవుతున్నదని , ఈ సందర్భంగా సంవత్సరం క్రితం కాంగ్రెస్ పార్టీని బలపరిచి గెలిపించిన గెలిపించిన ప్రజలందరికీ, తెలంగాణ ప్రభుత్వ పాలనకు సహకరిస్తున్న ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం తరుపున, కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.
ఒక ఉద్యమకారుడుగా, విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో నా బాధ్యతను చూసి నన్ను గెలిపించిన హుస్నాబాద్(Husnabad) నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. అంతేగాక ఈ సంవత్సర కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, రాబోయే నాలుగేళ్లలో కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా స్వామ్య విలువలతో, ప్రజాస్వామ్య రక్షణకై కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యచరణ ఉండబోతోందని అన్నారు. ఈ సంవత్సర కాలం ఏ విధంగా ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టి ప్రజా ప్రభుత్వానికి సహకరించారో.. రాబోయే కాలంలో కూడా ఆశీర్వదించి, ప్రజాప్రభుత్వాన్ని బలోపేతం చేయాలని కోరారు. రాబోయే కాలంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను అందిస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.