- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీలోకి Ponguleti Srinivas Reddy చేరిక దాదాపు ఖరారు?
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డితో చర్చలు జరిపేందుకు నేరుగా బీజేపీ అధిష్టానమే రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పొంగులేటి భేటీకి ముహూర్తం ఖరారైంది. ఈనెల 18వ తేదీన అమిత్ షాతో శ్రీనివాస్ రెడ్డి సమావేశం కానున్నారు. అమిత్ షాతో భేటీ అనంతరం పొంగులేటి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయమై ఇప్పటికే పొంగులేటి అనుచరులను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 10వ తేదీ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని తన అనుచరులతో సమావేశాలు జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పట్టు ఉన్న శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరితే బీఆర్ఎస్‌కు భారీ షాక్ తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి దీనిపై బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Also Read...
తెలంగాణకు సుప్రీంకోర్టు నోటీసులు
కేసీఆర్‌కు డబుల్ షాక్.. పొంగులేటితో పాటు బీజేపీలోకి మరో ముఖ్య నేత?