- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jagruti పేరుతో పాలి'ట్రిక్స్'.. liquor scam నుంచి గట్టేక్కెందుకేనా?
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జాగృతి ఒక స్వచ్ఛంద సంస్థ. ఏ పార్టీకి సంబంధం లేకుండా ఏర్పడింది. ఉద్యమ సమయంలో ప్రజల గొంతుకై తనవంతు పాత్ర పోషించింది. స్వచ్ఛంద కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టింది. కాగా, ప్రస్తుతం జాగృతికి పొలిటికల్ కలర్ అంటుకుంటున్నది. తెలంగాణ సంస్కృతే లక్ష్యంగా ఏర్పడిన జాగృతి.. ఇప్పుడు పాలిటిక్స్‌పై ఫోకస్ పెట్టింది. అన్ని రాష్ట్రాల్లో శాఖల ఏర్పాటు, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మద్దతుగా ప్రచారం చేసేందుకు రెఢీ అవుతున్నది. కమిటీల కూర్పుపై ప్రణాళికలూ రూపొందిస్తున్నది. నాలుగేళ్లుగా స్తబ్దుగా ఉన్న జాగృతిని యాక్టీవ్ చేసే దిశగా అడుగులు వేస్తుండటంతో లిక్కర్ స్కాం నుంచి బయటపడేందుకేనా అనే ప్రచారం ఊపందుకున్నది. ఒక్కసారిగా జాగృతి సంస్థ పొలిటికల్‌గా మారుతుండటంతో ప్రస్తుతం పనిచేస్తున్న వలంటీర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం ఏ పార్టీకి మద్దతు లేకుండా స్వచ్ఛందంగా ముందుకు సాగడంతో యువతతోపాటు ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్నవారు సైతం వలంటీర్లుగా పనిచేస్తున్నారు. సోమవారం నిర్వహించిన జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్‌కు మద్దతుగా వలంటీర్లు ఉండాలని, రాబోయే ఎన్నికలకు సన్నద్ధం కావాలని, కేంద్ర ప్రభుత్వంపై, దర్యాప్తు సంస్థలపై విమర్శలు గుప్పించడంతో వలంటీర్లు సందిగ్ధంలో పడ్డారు.
స్కామ్ నుంచి బయటపడేందుకేనా!
లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను సీబీఐ అధికారులు ఈనెల 11న ఏడున్నర గంటలపాటు విచారించారు. తదుపరి సీఆర్పీసీ 91 కింద నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, 2018 తర్వాత జాగృతి యాక్టీవిటీస్ తగ్గాయి. సంస్థ రాష్ట్ర కమిటీ నుంచి కార్యక్రమాల షెడ్యూల్‌ను సైతం ఇవ్వడం లేదు. ప్రతి రెండేళ్లకు ఒకసారి నూతన కమిటీని వేయాల్సి ఉండగా నాలుగేళ్లుగా ప్రోగ్రాంలు నిర్వహించడం లేదు. ఒకానొక దశలో జాగృతిని రద్దుచేశారా అనే ప్రచారమూ జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జాగృతి యాక్టీవిటీని పెంచాలనుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ స్కామ్ నుంచి బటయపడేందుకే మళ్లీ జాగృతి కార్యక్రమాలను విస్తృతం చేయాలని భావిస్తున్నారనే ప్రచారం ఊపందుకున్నది. సమావేశంలో జాగృతి శ్రేణులకు ఎలాంటి కార్యచరణ ఇవ్వకపోవడం, ఎందుకు నిర్వహించారో తెలియకపోవడంతో వారిలో ఉత్సాహం కనిపించలేదు.
ఇతర రాష్ట్రాల్లో విస్తరణకు చిక్కులు
ఉద్యమ సమయంలో మహిళలను, యువతను చైతన్యం చేయడంలో తెలంగాణ జాగృతి కీలక భూమిక పోషించింది. జాగృతిని ఇప్పటికే 18 రాష్ట్రాల్లో విస్తరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ జాగృతిని విస్తరించే పనిలో సంస్థ అధ్యక్షురాలు కవిత నిమగ్నమైంది. కాగా తెలంగాణ జాగృతి పేరు మార్చకుండా ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మద్దతుగా ఎలా ప్రచారం చేయాలనే భావన వలంటీర్లలో ఉన్నది. ఇదిలా ఉంటే తెలంగాణ జాగృతి విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన పలువురు వక్తలు భారత్ జాగృతి ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేశారు. దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని కవితను కోరారు. దీనికి కవిత మాత్రం స్పందించలేదు. పేరుమార్పుపై వ్యూహాత్మక మౌనం పాటించారు. ఒక్క పిలుపునిస్తే అన్ని రాష్ట్రాల్లో శాఖలు ఏర్పడే శక్తి ఉందని పేర్కొన్నారు. అయితే రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఏడాదిన్నర గడువు ఉండటంతో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారో చూడాలి.
Also Read...
ఢిల్లీకి పయనమవుతున్న BRS నేతలు.. రహస్యంగా వెళ్లేందుకు అధికారుల యత్నం