బిగ్ బ్రేకింగ్: టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసు ఛేదించిన పోలీసులు.. అంతా చేసింది 16 ఏళ్ల యువకుడే..!

by Satheesh |   ( Updated:2023-04-04 14:08:20.0  )
బిగ్ బ్రేకింగ్: టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసు ఛేదించిన పోలీసులు.. అంతా చేసింది 16 ఏళ్ల యువకుడే..!
X

దిశ, వరంగల్ బ్యూరో: ఉమ్మడి వరంగల్ జిల్లా కమలాపూర్ మండలంలోని ఓ పరీక్ష కేంద్రంలో టెన్త్ పరీక్ష పేపర్ లీక్ అయిన ఘటన తెలంగాణలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వరంగల్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేప్టటారు. 24 గంటలు గడవకముందే వరంగల్ పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఓ 16 ఏళ్ల బాలుడు.. పరీక్ష సెంటర్‌లోకి దూకి పేపర్ లాక్కొని ఫోటో తీసుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఆ బాలుడితో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి విషయాలు మరి కాసేపట్లో వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించనున్నారు.

Advertisement

Next Story