- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరదలపై ప్రభుత్వ పనితీరు భేష్.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ ఫోన్
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. వర్షాలు, భారీ వరదల పరిస్థితిని.. జరిగిన నష్టాన్ని సీఎంను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు ఎక్కడెక్కడ వరదలు సంభవించాయో ప్రధానికి రేవంత్ రెడ్డి వివరించారు. తక్కువ ప్రాణనష్టంతో ప్రజలను ఏ విధంగా ముందు జాగ్రత్తగా రక్షించింది తెలిపారు. కాగా ఖమ్మం పట్టణంలో సంభవించిన జలవిలయాన్ని, మున్నేరు వాగులో చిక్కుకున్న వారిని రక్షించిన విషయాలు వివరించగా.. అప్రమత్తంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని ప్రధాని మోడీ అభినందించారు. మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి, బాదితులను ఆదుకోవడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అవసరమైన తక్షణ సహాయాన్ని వెంటనే అందిస్తామని తెలిపిన మోడీ.. అవసరమైతే హెలికాప్టర్లను పంపిస్తామని హామీ ఇచ్చారు.