- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఫ్రెండ్స్‌తో యంగ్ రేవంత్‌రెడ్డి హోలీ సంబరాలు చూశారా? చదువుకునే రోజుల్లోనే?

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణవ్యాప్తంగా (Holi) హోలీ వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. హోలీ సంబరాలు జరుపుకుంటున్న ఫోటోలను నెటిజన్‌లు సమాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) యంగ్ ఏజ్‌లో ఫ్రెండ్స్‌తో హోలీ సంబరాలు చేసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రేవంత్ రెడ్డి... చదువుకునే రోజుల్లో, తన స్నేహితులతో కలిసి హోలీ పండుగ జరుపుకున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట కాంగ్రెస్ శ్రేణులు షేర్ చేస్తున్నారు. పూర్తిగా రంగులతో నిండిన రేవంత్ రెడ్డి ఫోటోలు, సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తిలో హై స్కూల్, ఇంటర్ పూర్తి చేసిన రేవంత్.. 1989లో హైదరాబాద్ దోమలగూడలోని ఏవీ కాలేజీలో బీఏ చదివారు. మూడేళ్లపాటు అదే కళాశాలలో చదివి.. ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుడిగా విద్యారంగ సమస్యలపై పోరాటం చేసి.. విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు.
Read More..
CM Revanth: రాష్ట్ర ప్రజలకు హోలీ విషెస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి