- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ఫామ్ హౌస్ లో తనిఖీ చేయండి.. ఫోన్ ట్యాపింగ్ కేసులో డీజీపీకి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
దిశ, డైనిక్ బ్యూరో:ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ పాత్రపై విమర్శల జోరు పెరుగుతోంది. ఫోన్ ట్యాపింక్ కేసులో కేసీఆర్ పాత్ర ఉందని ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ ముఖ్యనేతలు ఆరోపిస్తుండగా తాజాగా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేసిన వార్ రూమ్ ను తక్షణమే తనిఖీ చేసి ఫామ్ హౌస్ ను సీజ్ చేయాలని కాంగ్రెస్ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్, కాంగ్రెస్ మీడియా కన్వీనర్లు డీజీపీకి కంఫ్లయింట్ చేశారు. నాటి సీఎం కేసీఆర్ రోజుల తరబడి ఫామ్ హౌస్ లోనే ఉంటూ ప్రతిపక్షం, వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ వారిపై అక్రమ కేసులు బనాయించారని ఇటువంటి చర్యలు చట్టవిరుద్దం అని తెలిసి కూడా నాటి అధికారులు ఇందుకు సహకరించారని అందువల్ల ఈ విషయంలో లోతైన విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
2021లో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో హరీశ్ రావు తెరవెనుక ఉండి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అనుమానితులు, అరెస్ట్ అయిన వారి ఆస్తుల వివరాలు తీసు ఏసీబీ, ఈడీ సంస్థలతో దర్యాప్తు చేయాలని కోరారు. వారి బినామి పేర్ల మీద ఉన్న ఆస్తులను గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ రావు పాత్రపై లోతుగా విచారించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.