Telangana DGP : పోలీసుల డీపీతో ఫోన్ కాల్స్.. డీజీపీ బిగ్ అలర్ట్

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-19 04:15:59.0  )
Telangana DGP : పోలీసుల డీపీతో ఫోన్ కాల్స్.. డీజీపీ బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల సైబర్ కేటుగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఏకంగా పోలీసుల డీపీతో ఫోన్ కాల్స్ చేసి ఉచ్చులోకి లాగుతున్నారు. ఇలాంటి ఘటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ డీజీపీ జితేందర్ ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రజలను కోరారు. ఓ వ్యక్తికి అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి తాను పోలీసునంటూ మీ కుమారుడు రేప్ కేసులో పట్టుబడ్డాడని చెప్పి డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని కేటుగాడితో ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి రికార్డు చేయగా డీజీపీ ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇలా పోలీస్ డీపీ ఫొటో పెట్టుకున్న అపరిచితులు ఫోన్ చేసి మీకు సంబంధించిన వాళ్లు పట్టుబడ్డారని, లేదా వాళ్ల పేరు మీద ఇల్లీగల్ డ్రగ్స్ కొరియర్లు వచ్చాయని చెబుతారని తెలిపారు. ఇంకేదో పెద్ద తప్పు పని చేశారని మిమ్మల్ని టెన్షన్‌లో పెట్టి బురిడీ కొట్టిస్తారన్నారు. అలాటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ పోస్టును తెలంగాణ పోలీసు, డయల్ 1930కి ట్యాగ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed