- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్ న్యూస్: 16.8 కోట్ల మంది పర్సనల్ డేటా లీక్.. ఐడీ, పాస్ వర్డ్‌లతో సహా..
దిశ, వెబ్‌డెస్క్: ప్రజల పర్సనల్ డేటాను చోరీ చేసి అమ్ముకుంటున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు ముఠా సభ్యులను గురువారం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. కాగా, ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు. 16.8 కోట్ల మంది దేశ పౌరుల డేటా చోరీకి గురైందని సీపీ తెలిపారు.
కోట్లాది మంది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుల డేటా చోరీకి గురైందని.. అంతేకాకుండా లక్షల ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్ స్టా గ్రామ్ ఎకౌంట్ల ఐడీ పాస్ వర్డ్‌లు కూడా లీక్ అయ్యాయని పేర్కొన్నారు. నిందితులు ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డులు, లోన్ అప్లికేషన్ల నుంచి వివరాలు సేకరించి సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నారని చెప్పారు. డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగుల సెన్సిటివ్ డేటా సైతం అమ్మకానికి పెట్టారని.. ఈ డేటా లీక్‌తో దేశ భద్రతకే ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ఐటీ ఉద్యోగుల డేటా కూడా నిందితుల సైబర్ నేరగాళ్లకు విక్రయించారని తెలిపారు. ఓ బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు ఏజెన్సీ ఉద్యోగి డేటాను నిందితులకు అమ్ముకున్నాడని చెప్పారు.