ఆ అంశాన్ని మంత్రికి అప్పగించాం.. జగిత్యాల ఘటనపై మరోసారి పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
ఆ అంశాన్ని మంత్రికి అప్పగించాం.. జగిత్యాల ఘటనపై మరోసారి పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల(Jagtial) జిల్లా జాబితాపూర్‌లో కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) అనుచరుడు గంగారెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కారుతో వెనుక నుంచి ఢీ కొట్టి, సంతోష్‌ అనే వ్యక్తి కత్తితో దాడి చేశారు. రక్తం మడుగులో ఉన్న గంగారెడ్డి ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయాడు. పాతకక్షలతోనే హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పలుమార్లు సంతోష్‌పై పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని గంగారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. పోలీసుల తీరుపై జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ రాజ్యంలో కాంగ్రెస్‌ నేతలకే రక్షణ కరువైందని ఆరోపించారు. తాజాగా.. ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(PCC chief Mahesh Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాల అంశాన్ని మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగించినట్లు తెలిపారు. పార్టీ ఆలోచన మేరకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ నేత గంగారెడ్డి హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టం అని సీరియస్ అయ్యారు. ‘జీవన్ రెడ్డితో తాను ఫోన్‌లో మాట్లాడాను. ప్రధాన అనుచరుడి హత్యతో ఆయన ప్రస్తుతం ఆవేదనలో ఉన్నారు. జీవన్ రెడ్డి ఆవేదనను అర్థం చేసుకుంటాం’ అని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed