పెళ్లి విందులో తాటి ముంజలు.. అదిరిపోయే ఐడియాకు అతిథులు ఫిదా

by Disha Web Desk 4 |
పెళ్లి విందులో తాటి ముంజలు.. అదిరిపోయే ఐడియాకు అతిథులు ఫిదా
X

దిశ, ఇబ్రహీంపట్నం : పెళ్లి విందులో తాటి ముంజలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. పెళ్ళికొడుకు తరపున వచ్చిన అతిథులకు తాటి ముంజలను తినడానికి ఏర్పాటు చేశారు. దీంతో పెళ్లి విందుకు వచ్చిన అతిథులు కొత్త కాన్సెప్ట్ బాగుందే అంటూ తాటి ముంజలని ఇష్టంగా తిన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దొరికే తాటి ముంజలు హైదరాబాద్ ఫంక్షన్‌లో ప్రత్యక్షమవడంతో వచ్చిన వారంతా ఇష్టంగా ఆరగించారు. రంగారెడ్డి జిల్లా తుర్క యంజాల్ మున్సిపాలిటీ మన్నెగూడలోని బిఎంఆర్ శ్రద్ధ కన్వెన్షన్‌లో ఈ ఘటన జరిగింది. ఆధునిక టెక్నాలజీ, పాశ్చాత్య సంస్కృతితో మన సంస్కృతి, సంప్రదాయాలను దూరం అవుతున్న ఈ తరుణంలో పల్లెటూర్లలో దొరికే తాటి ముంజలు పెళ్లి విందులో ఏర్పాటు చేయడం పట్ల విందులో హాజరైన వారు హర్షం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed