Palamuru Rangareddy lift irrigation : పాలమూరు-రంగారెడ్డి ఇనాగరేషన్.. KTR ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-16 10:14:56.0  )
Palamuru Rangareddy lift irrigation : పాలమూరు-రంగారెడ్డి ఇనాగరేషన్..  KTR ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇవాళ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘తరతరాల ఎదురు చూపులు ఫలించే వేళ.. పల్లేర్లు మొలిచిన పాలమూరులో పాలనురగల జలహేల.. వలసల వలపోతల గడ్డపైన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఆవిష్కృతం.. కరువు కరాళ నృత్యం చేసిన భూముల్లో కృష్ణమ్మ జల తాండవం.. శెలిమలే దిక్కైన కాడ.. ఉద్దండ జలాశయాలు.. బాయిమీద పంపుసెట్లు నడవని చోట బాహుబలి మోటర్లు.. స్వరాష్ట్ర ప్రస్థానంలో సగర్వ సాగునీటి సన్నివేశం.. ఆరు జిల్లాలు సస్యశ్యామలం

దక్షిణ తెలంగాణకు దర్జాగా జలాభిషేకం..

నిన్న పరాయి నేలపైన ప్రాజెక్టులకు రాళ్ళెత్తిన పాలమూరు లేబర్.. నేడు సొంత భూమిలో ప్రాజెక్టుల కింద రత్నాలు పండిస్తున్న ఫార్మర్.. నాడు నది పక్కన నేల ఎడారిలా.. ఎండిన విషాదం! సమైక్య పాలకుల పాపం.. కాంగ్రెసోళ్ల శాపం! బిర బిరా తరలి వెళ్తున్న కృష్ణమ్మను బీడు భూములకు రప్పించేందుకు స్వయం పాలనలో సాహస యజ్ఞం! ఆటంకాలు అవరోధాలు అధిగమించి.. ప్రతి పక్షాల కుట్రలు కేసులు ఛేదించి సవాల్ చేసి సాధించిన విజయం! నీటి వాటా తేల్చకుండా నిర్లక్ష్యం అనుమతుల్లో అంతులేని జాప్యం ఐనా.. కేంద్ర సర్కారు కక్షను వివక్షను దీక్షతో గెలిచిన దృఢ సంకల్పం! తీరిన దశాబ్దాల నీటి వెత తెచ్చుకున్న తెలంగాణకు ఇదే సార్థకత’’ అంటూ కవిత్వం చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed