Padi Koushik Reddy : హుజూరాబాద్ లో ఇందిరమ్మ ఇళ్లేవి? : పాడి కౌశిక్ రెడ్డి

by M.Rajitha |
Padi Koushik Reddy : హుజూరాబాద్ లో ఇందిరమ్మ ఇళ్లేవి? : పాడి కౌశిక్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Houses)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (BRS MLA Padi Koushik Reddy) కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గురువారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో హుజూరాబాద్(Huzurabad) నియాజకవర్గానికి తీవ్ర అన్యాయం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గంలో 40 వేల మందికి పైగా ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా స్వయంగా సిఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. కానీ మొత్తం నియోజకవర్గానికి ఇచ్చింది కేవలం 800 ఇళ్ళు మాత్రమే ఇచ్చారని, మరి మిగతా వారికి ఎప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హుజూరాబాద్ లో 106 గ్రామాలు ఉంటే కేవలం ఐదు గ్రామాల్లో మాత్రమే ఇళ్ళు పంపిణీ చేశారని.. మిగతా గ్రామాల ప్రజలకు మొండిచేయి చూపించారని ఫైర్ అయ్యారు.

ప్రొసీడింగ్ పత్రాల మీద ఎవ్వరి సంతకాలు లేవని.. వాటిని నమ్మితే నట్టేట మునగడం ఖాయం అని ప్రజలకు సూచించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(Indiramma Athmiya Bharosa) కింద తమ నియోజకవర్గంలో స్థలం లేని వారికి రూ.12 వేలు ఇస్తామని సీఎం మాట ఇచ్చారని.. కానీ వాస్తవంలో చూస్తే.. 9188 మందికి స్థలం లేదు అని ప్రభుత్వం తెలిపిండని.. వారిలో 4597మందికి వారికి మాత్రమే ఆత్మీయ భరోసా ఇచ్చారని, మిగతా వారి గతి ఏమిటని అన్నారు. వీటన్నిటిపై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉనప్పుడు కేసీఆర్(KCR) రైతుబంధు(Rythubandhu) కోటి అరవై లక్షల ఎకరాలకు ఇచ్చామని.. దీనిలో అవకతవకలు ఉన్నాయని అనవసర విష ప్రచారం చేసి, ఇవుడు కాంగ్రెస్ ప్రభుత్వం కోటి యాభై లక్షల ఎకరాలకు ఇస్తుందని, కేవలం 1.8% మాత్రమే తగ్గించారని అన్నారు.

అప్పుడు రెండు వేల కోట్ల మోసం జరిగిందని చెప్పి ఇపుడు 200 కోట్లు మాత్రమే అని అబద్దాలు చెబుతున్నారని.. రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన చేస్తున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదని, ప్రజలు ఛీ కొట్టే పాలన అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై సునీల్ కనుగోలు ఓటింగ్ నిర్వహిస్తే.. 86% మంది ప్రజలు కేసీఆర్ ప్రభుత్వమే బాగుందని తీర్పు ఇచ్చారని.. కాంగ్రెస్ కు ఈ సమధానం చెంపపెట్టు లాంటిదని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ అబద్దాలతో ముందుకు వస్తోందని, ప్రజలు గమనించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Next Story