Padi Koushik Reddy : డ్రగ్స్ కేసుపై పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by M.Rajitha |
Padi Koushik Reddy : డ్రగ్స్ కేసుపై పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) బంధువు ఇంట్లో జరిగిన రేవ్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపిన విషయం తెలిసిందే. అది రేవ్ పార్టీ కాదని ఇంట్లో ఫంక్షన్ జరుపుతున్నారని స్వయంగా కేటీఆర్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) డైరెక్షన్లో జరిగిన డ్రామా ఇది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. నిజానికి ప్రభుత్వ టార్గెట్ రాజ్ పాకాల కాదని, కేటీఆర్ అని వెల్లడించారు. పార్టీ జరుగుతున్న ఫామ్ హౌస్ కి కేటీఆర్ వస్తారని, అక్కడ ఆయన్ని డ్రగ్స్ కేసులో గాని, ఇంకేదైనా కేసులో గాని ఇరికిద్దామని చూశారని మండి పడ్డారు. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ నేతలు నాపై కూడా ఇలాంటి కుట్రలకు పాల్పడ్డారని తెలిపారు. ఇలాంటి కుతంత్రాలు ఎన్ని చేసినా.. భయపడేది లేదని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story

Most Viewed