PAC Meeting: పీఏసీ సమావేశంలో గందరగోళం.. బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్

by Shiva |   ( Updated:2025-02-11 08:06:53.0  )
PAC Meeting: పీఏసీ సమావేశంలో గందరగోళం.. బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ‌ అసెంబ్లీ (Telangana Assembly)లో మంగళవారం జరిగిన పబ్లిక్ అకౌంట్స్ సమావేశం (Meeting of Public Accounts) రసాభాసగా మారింది. ఈ భేటీకి హాజరైన ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) స‌భ్యులు మాట్లాడుతుండగా పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ (PAC Chairman Arikepudi Gandhi) మైక్ కట్ చేశారు. దీంతో పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ నియామకాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు సమావేశాన్ని బహిష్కరించారు. ఈ సందర్భంగా పీఏసీ స‌భ్యులైన వేముల ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy), సత్యవతి రాథోడ్ (Satyavati Rathore), ఎల్.రమణ (L Ramana) తమ నిరసనను తెలిపి, మధ్యలోనే సమావేశాన్ని బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో అరికెపూడి గాంధీ చైర్మన్‌గా ఉంటారో.. లేదో తెలియదని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టు (Supreme Court)లో విచారణ కొనసాగుతోందని కామెంట్ చేశారు. అదేవిధంగా పీఏసీ పదవి అనేది ప్రతిపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. కేసీఆర్ సూచించిన వారికే ఆ పదవి ఇవ్వాలని వారు బీఆఎస్ సభ్యులు డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed