- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతిపక్షాలు ఆర్టికల్ 53(1) చదవాలి.. నూతన పార్లమెంట్ ఓపెనింగ్‌పై OYC కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఎన్నికలపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. తాము 365 రోజులు ప్రజల్లో ఉంటామని అందువల్ల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమకు ఎలాంటి ఆందోళన లేదన్నారు.
బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎంఐఎం మిగతా పార్టీల మాదిరిగా ఎన్నికల కోసం పని చేయదని ప్రజల కోసం అను నిత్యం పనిచేస్తామమన్నారు. మేము చేసే పనే ఎన్నికల్లో మా గుర్తింపుగా ఉంటుందని చెప్పారు. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ఎంఐఎం దూరంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని ప్రారంభించాలనే నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ సర్వాధికారాలు స్పీకర్‌కే ఉంటాయని రాష్ట్రపతి కూడా ప్రారంభించేందుకు వీలు లేదన్నారు. విపక్షాలు సైతం రాష్ట్రపతి చేత ప్రారంభించాలని అంటున్నారని వారంతా ఆర్టికల్ 53(1) చదవాలని సూచించారు. ఒక వేళ పార్లమెంట్ భవనాన్ని స్పీకర్ ప్రారంభిస్తే పాల్గొంటామన్నారు. ప్రారంభోత్సవం విషయంలో ప్రధాని మోడీ పక్కకు తప్పుకోవాలని శిలాఫలకం మీద ప్రధాని పేరు తప్పక ఉంటుందని సెటైర్ వేశారు.
ప్రారంభోత్సవం విషయంలో ప్రధాని తప్పుకుని స్పీకర్ ఓంబిర్లాకు అకాశం కల్పించి అధికారాల విభజనపై తమకు గౌరవం ఉందని నిరూపించుకోవాలన్నారు. పార్లమెంట్ భవనంలో రాజదండం ఏర్పాటు చేయడంపై స్పందిస్తూ రాజదండంతో ఈ ప్రభుత్వం అధికారాల విభజనపై దాడి చేస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.