- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ధాన్యం పై పోరుషురూ.. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఉద్రిక్తత
దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగి ధాన్యం కేంద్రం పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టారు. నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన దీక్షలో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు పాల్గొనగా... మండల కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు, రైతు బంధు సమితి సభ్యులు, పీఏసీఎస్ చైర్మన్, టీఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాసంగి ధాన్యం అంతా కేంద్ర కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలో పలువురు మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలు చేసేదాక మోదీ ప్రభుత్వాన్ని వదిలేది లేదని స్పష్టం చేశారు. కేంద్రం కొనుగోలుపై స్పష్టమైన వైఖరి చెప్పే వరకు వరి సాగు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించిందన్నారు. అయినప్పటికీ వరి వేయాలని బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టారన్నారు. వరి కొనిపిస్తామన్న బీజేపీ నేతలు ఇప్పుడు కనిపించడం లేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేసేంత వరకు విడిచిపెట్టలేదన్నారు. యాసంగి ధాన్యాన్ని నేరుగా కేంద్రమే కొనుగోలు చేయాలని ముక్తకంఠంతో నినదించాయి. మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్, ఖమ్మం జిల్లా మంచుగొండ లో మంత్రి పువ్వాడ అజయ్, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య ఉద్రిక్తత
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని చౌరస్తాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలుపై మండలంలో నిరసన దీక్షలు సోమవారం చేపట్టారు. మరో పక్క బీజేవైఎం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో డ్రగ్స్ అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో కేసీఆర్ డాం డాం అంటూ బీజేపీ వాళ్లు,మోడీ డాం డాం టీఆర్ఎస్ వాళ్ళు చేసిన నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీల నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.