- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. రేపటినుంచే సందర్శకులకు ఎంట్రీ
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌లో మైదానంలో నుమాయిష్ ప్రారంభం అయింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లు ఈ నుమాయిష్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రానికి నుమాయిష్ గర్వకారణంగా నిలుస్తోందని చెప్పారు. లాభాపేక్ష లేకుండా ఎన్నో ఏళ్లుగా నిర్వహకులు ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎగ్జిబిషన్ సొసైటీ విద్యా సంస్థల్లో 30 వేల మంది విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకున్నారని.. అందుకే కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చారని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని చెప్పారు. కాగా, ఎగ్జిబిషన్‌ను జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహిస్తారు. ఈ నుమాయిష్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 46 రోజుల పాటు సాగే నుమాయిష్- ఎగ్జిబిషన్ కు టికెట్ ధరలు, విజిటింగ్ అవర్స్ లల్లో ఎటువంటి మార్పు చేయలేదన్నారు.