- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ganesh Immersion : ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం లేదు.. హైదరాబాద్ సీపీ ఆనంద్..భక్తులకు కండిషన్స్ ఇవే!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈసారి ట్యాంక్‌బండ్‌పై గణేష్ నిమజ్జనం లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గణేష్ నిమజ్జనం ఉత్సవాల సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌లో గణపతి నిమజ్జనం కోసం ఏర్పాటు జరుగుతున్నాయని అన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరిస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్ సిటీ పరిధిలో 15 వేలు.. ఇతర జిల్లాల నుంచి మరో 3వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరో 8 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారని వెల్లడించారు. మరోవైపు మిలాద్ ఉన్ నబీ కార్యక్రమం ఉందని మత పెద్దలతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా 17న పబ్లిక్ గార్డెన్‌లో ప్రజా పాలన దినోత్సవం కార్యక్రమం, పెరేడ్ గ్రౌండ్ లో ఇంకో ప్రోగ్రామ్ ఉందని సీపీ పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్‌లో సెప్టెంబర్ 17న నిమజ్జనాల కార్యక్రమం జరుగనుంది
భక్తులకు నియమ నిబంధనలు ఇవే..
నిమజ్జనానికి వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని, ఆ రోజున కొన్ని నియమాలు పాటించాలని హైదరాబాద్ సిటీ పోలీసులు ఎక్స్ వేదికగా తెలిపారు. గణేష్ విగ్రహానికి ఒక వాహనానికి మాత్రమే అనుమతిస్తారు. సౌత్ జోన్ పరిమితుల నుంచి విగ్రహాలను తీసుకు వెళ్లే వాహనాలు ముందుగానే బయలుదేరాలి. ఏసీపీ కేటాయించిన నంబర్ వాహనంపై ఉండాలి. నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై లౌడ్ స్పీకర్‌ను మర్చకూడదు. నిమజ్జనం రోజు వాహనాలపై DJతో కూడిన మ్యూజికల్ సిస్టమ్‌ను అనుమతించరు. రంగులు పిచికారీ చేయడానికి కాన్ఫెట్టీ గన్‌లను ఉపయోగించవద్దు. విగ్రహాన్ని తీసుకువెళ్లే వాహనంలో మద్యం లేదా మరేదైనా మత్తు మందులు తాగిన వ్యక్తులను అనుమతించరు.
రహదారిపై వెళ్లేటప్పుడు వాహనం ట్రాఫిక్‌ను ప్రభావితం చేయకూడదు. విగ్రహాన్ని తీసుకువెళ్లే వాహనం ఏదైనా ప్రార్థనా స్థలం దగ్గర లేదా ఇతర వాహనాలకు లేదా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే రహదారిపై ఆగకూడదు. ఊరేగింపులో ఎవరూ కర్రలు/ కత్తులు, మారణాయుధాలు, మండే పదార్థాలు లేదా ఇతర ఆయుధాలను తీసుకెళ్లకూడదు. ఊరేగింపు సమయంలో బాణసంచా కాల్చరాదు. జెండాలు లేదా అలంకరణల కోసం ఉపయోగించే కర్రలు 2 అడుగుల పొడవు మించకూడదు. వెర్మిలియన్, కుంకుమ లేదా గులాల్ బాటసారులపై వేయవద్దు. ఊరేగింపులో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు/ రెచ్చగొట్టే ప్రసంగాలు/ నినాదాలు లేదా రెచ్చగొట్టే సంకేతాలు లేదా బ్యానర్లు ఉపయోగించరాదు. ఏ వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఇతర రెచ్చగొట్టే చర్యలు చేయవద్దు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలను పాటించండి. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో, 100కి డయల్ చేసి తెలియాలి.
- Tags
- Ganesh immersion