తెలంగాణలో బర్డ్​ప్లూ కేసులు నమోదు కాలేదు : పశుసంవర్ధక శాఖ

by M.Rajitha |
తెలంగాణలో బర్డ్​ప్లూ కేసులు నమోదు కాలేదు : పశుసంవర్ధక శాఖ
X

దిశ, తెలంగాణ బ్యూర్ : రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖ అధికారులు పౌల్ట్రీ ఫారాల్లో తనిఖీలు చేపట్టారు. బర్డ్​ప్లూ అనుమానంతో చనిపోయిన కోళ్లకు సంబంధించిన శాంపిల్స్​సేకరిస్తున్నారు. ఈమధ్యకాలంలో ఎండలు విపరీతంగా పెరగడం కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. ఇప్పటివరకు సేకరించి నమూనాలు ల్యాబ్​కు పంపడంతో గురువారం నాటికి స్పష్టత వస్తోందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇన్ ప్లూ యేంజా లక్షణాలు కనిపిస్తే వాటిని వేరు చేయాలని సూచిస్తున్నారు. తెలంగాణలో నిజామాబాద్​,కామారెడ్డి, నిర్మల్​, ఖమ్మం జిల్లా కోళ్లు చనిపోతున్నాయి. కోళ్ల ఫారాలకు ముమ్మరంగా తనిఖీలు చేసి వ్యాధి వ్యాపించకుండా అవగాహన చేపడుతున్నారు. మహారాష్ట్ర, చత్తీష్​గడ్​, ఆంద్రప్రదేశ్ లో తీవ్రంగా ఉన్నట్లు గుర్తించి సరిహద్దులో చెక్​పోస్టులు ఏర్పాటు చేశారు.

ఇటీవల హెచ్చరించిన విధంగా కోళ్లు చనిపోయి ఉంటే వాటిని అక్కడి నుంచి తరలించి సర్వైలైన్​ జోన్​లోగా ప్రకటించాలని పేర్కొన్నట్లు గుర్తు చేశారు. ముఖ్యంగా రాష్ర్ట సరిహద్దులో 24 చెక్​పోస్టులు ఏర్పాటు చేసి, కోళ్లు, గ్రుడ్లు రాకుండా నిరోధించే చర్యలు చేపడుతున్నారు. చికెన్​,గుడ్లు తినేందుకు భయపడాల్సిన పనిలేదని, అదిక ఉష్ణోగ్రత లో ఈవైరస్​జీవించిందని వైద్యులు వెల్లడించారు. చికెన్​, ఎగ్​100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికిస్తామని, అందులో ఎలాంటి వైరస్​ప్రభావం ఉందని చెబుతున్నారు. ఈవైరస్​వ్యాప్తికి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. మనుషులపై ఈవైరస్​పెద్దగా ప్రభావం చూపదన్నారు.

చికెన్ కేజీ రూ.100 మాత్రమే

బర్డ్​ప్లూ భయానికి చికెన్​ధరలు గణనీయంగా పడిపోయాయి. మొన్నటివరకు కిలో రూ. 290 ఉండగా, కోడి మాంసం ధర అమాంతం కిలో రూ. 100లకు పడిపోయింది. వైరస్​తో జనం చికెన్​తినేందుకు దుకాణాల వైపు మళ్లీ చూడటం లేదు. 60 శాతం వరకు చికెన్​అమ్మకాలుపడిపోయాయి. గుడ్ల ధరలు తగ్గి 100 గుడ్లను రూ. 445 కే అమ్మకాలు చేస్తున్నారు.

బర్డ్​ప్లూ కేసులు నమోదు కాలేదు : పశుసంవర్ధక శాఖ డైరెక్టర్​గోపీ

తెలంగాణలో బర్డ్​ప్లూ కేసులు నమోదు కాలేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్​ గోపీ తెలిపారు. ఇతర కారణాలతో కోళ్లు మృతి చెందినట్లు, చికెన్​తినడంతో ఎలాంటి ఇబ్బందులు రావని చెప్పారు. సోషల్​మీడియాలో వస్తున్న ప్రచారం నమ్మవద్దని సూచించారు. వరంగల్​, ఖమ్మం జిల్లాలో కోళ్ల మృతిపై రక్త నమూనాలను ల్యాబ్స్​కు పంపించామని, ఇతర కారణాలతో మృతి చెందినట్లు తేలిందన్నారు. బర్డ్​ప్లూ పై కోళ్ల పెంపకం రైతులతో సమావేశాలుఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామన్నారు. కోళ్ల ఫారాల చుట్టూ బయో సెక్కూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోళ్లనుంచి మనుషులకు వైరస్​సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నారు. కోళ్ల ఫారాలలో వైరస్​సోకిన కోళ్లకు దగ్గరగా పనిచేసే వారికి స్వల్పంగా దగ్గు , జలుబు వచ్చే అవకాశం ఉందన్నారు. వైరస్​వ్యాప్తి చెందకుండా అనేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

Advertisement
Next Story

Most Viewed