మహిళా సాధికారత కేవలం బీజేపీతోనే సాధ్యం

by Sridhar Babu |
మహిళా సాధికారత కేవలం బీజేపీతోనే సాధ్యం
X

దిశ, నిజామాబాద్ సిటీ : ఇందూర్ పాటిదార్ భవన్లో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శక్తి వందన్ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడారు. స్త్రీ జాతి స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు, సాధికారత కోసం అనాది కాలం నుండి ఎన్నో ఉద్యమాలు, అణచివేతలు చూస్తూ వస్తున్నాం అని అన్నారు. మహిళా సాధికారత అంటే మహిళా దినోత్సవం రోజు వారిని గౌరవించి తరువాత వంటిల్లుకు పరిమితం చేయడం కాదని, నిజమైన మహిళా సాధికారత అంటే స్త్రీ లు తమ హక్కులను, బాధ్యతలను తెలుసుకొని తనకున్న శక్తి యుక్తులను సమగ్రంగా ఆవిష్కరించుకొని అందిన అన్ని అవకాశాలను వినియోగించుకోవడం అన్నారు.

విద్య, ఉపాధి ,వైద్య, సాహిత్య, క్రీడా, రాజకీయం ఇలా అన్ని రంగాలలో పురుషులతో పాటు సమాన అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని అన్నారు. స్త్రీ లను గౌరవించే ఏకైక దేశం మన భారత దేశం అన్నారు. మోడీ పరిపాలన వచ్చాక దేశంలో అనేక మార్పులు మనం చూస్తున్నామని, బీజేపీ మహిళలకు పెద్ద పీట వేసిందని అన్నారు. రాబోయే 2029 నాటికీ దేశంలో కాదు ప్రపంచంలో భారత దేశ మహిళలు బలమైన నారీ శక్తిగా రూపొందుతారని, అందులో భాగంగా ఒక గిరిజన మహిళ ద్రౌపతి మూర్మ్ ని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదేనని అన్నారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. ఉచిత గ్యాస్

సిలిండర్, జన్ధన్ అకౌంట్స్, స్వఛ్​ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం, ముద్ర లోన్స్, సుకన్య సమృద్ధి యోజన, పోషన్ మహాన్​ ఇలా అనేక సంక్షేమ పథకాలు మహిళల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శక్తి అభియాన్ ఇంచార్జ్ ఆకుల విజయ, జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, మహిళా మోర్చా పార్లమెంట్ ఇంచార్జ్ స్రవంతి రెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్ మహిళా శక్తి వందన్ అభియాన్ కో కన్వీనర్ డీఆర్​ భోగ శ్రావణి, అధ్యక్షురాలు ప్రవళిక, పల్లె గంగారెడ్డి, ప్రభారీ వెంకటరమణి, పెద్దోళ్ల గంగారెడ్డి, నాగోళ్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story