అమ్మవారి పుస్తెలు దొంగిలిస్తూ పట్టుబడ్డ మహిళ

by Sumithra |   ( Updated:2022-10-14 14:57:00.0  )
అమ్మవారి పుస్తెలు దొంగిలిస్తూ పట్టుబడ్డ మహిళ
X

దిశ, భిక్కనూరు : అమ్మవారి దర్శనానికి వచ్చినట్టు వచ్చి అమ్మ వారి మెడలో ఉన్న బంగారు పుస్తెలను దొంగిలించుకొని వెళుతుండగా మహిళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సంఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకివెళితే దోమకొండ మండలం యాడారం గ్రామానికి చెందిన మహిళ తన తల్లిగారింటికి వచ్చింది.

గ్రామంలోని దుర్గమ్మ ఆలయంలో దైవదర్శనానికి వచ్చి, అమ్మవారి మెడలో ఉన్న పుస్తెలను తెంపుకెళ్తుండగా, దైవ దర్శనానికి వచ్చిన మిగతా మహిళలు గమనించి ఆమెను పట్టుకొని దగ్గర్లో ఉన్న కరెంటు స్థంభానికి కట్టేసి ఎండలో నిల్చొబెట్టారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ఆలయంలో నుంచి ఇదే మహిళ చీరలు ఎత్తుకు పోవడం, సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నిక్షిప్తమైనప్పటికీ సరిగ్గా ఆమె మొహం కనిపించకపోవడంతో గుర్తించలేకపోయారు. సదరు మహిళ డబ్బులకోసం కక్కుర్తిపడి ఈ దొంగతనానికి పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కాగా ఈ విషయమై గ్రామస్తులు సమాచారం అందించి, దొంగతనానికి పాల్పడిన మహిళను పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.

Advertisement

Next Story