అండగా నిలబడతా..మీకు నేనున్న..

by Naveena |
అండగా నిలబడతా..మీకు నేనున్న..
X

దిశ, భిక్కనూరు : అధైర్య పడవద్దని..మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చిన్నారులకు ధైర్యం నూరి పోశారు. ఇటీవల సంగారెడ్డి జిల్లాలో మర్డర్ అయిన భిక్కనూరు మండలం మల్లు పల్లి గ్రామ బీజేపీ అధ్యక్షులు మాలినారాయణ ఇంటికి ఆయన ఆదివారం సాయంత్రం వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి కుమారుడు, కూతురిని చేరదీసి వారి చదువు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లల స్టడీస్ చూసుకునే బాధ్యత తన దేనని వచ్చే విద్యా సంవత్సరం నుంచి మోడల్ స్కూల్ లో జాయిన్ చేస్తానని చెప్పారు. ఏమైనా అవసరముంటే మొహమాటం లేకుండా తనకు కాని, పార్టీ నాయకులకు కాని ఫోన్ చేయాలని సూచించారు. ఆయన వెంట బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నంది వేణు, కామారెడ్డి బిజెపి అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి, మండల బిజెపి అధ్యక్షులు ఉప్పరి రమేష్, బిజెపి గ్రామ శాఖ నాయకులు వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Next Story