మున్సిపాలిటీ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలి: సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి లేఖ

by Shiva |
మున్సిపాలిటీ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలి: సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి లేఖ
X

దిశ ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపాలిటీలో జరిగిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి బుధవారం లేఖ రాశారు. ఈ మేరకు ఆ లేఖలో మునిసిపాలిటీ పరిధిలో 800 పైచిలుకు అసైన్మెంట్ భూముల్లో అక్రమ నిర్మాణాలు, వెంచర్లు వెలిశాయని పేర్కొన్నారు. అదేవిధంగా 36 ఎకరాల గుట్ట, దోబీ ఘాట్, హౌసింగ్ బోర్డ్ ఏరియాల్లో ఆక్రమణలో ఉన్న 16 ఎకరాల భూమి, అక్రమ వెంచర్లు, ఇరిగేషన్ స్థలాలపై విచారణ జరగాలన్నారు. మునిసిపాలిటీ నుంచ కాంట్రాక్టర్లకు మంజూరు చేసిన బిల్లులు, గడువు ముగిసిన వాహనాల కొనుగోళ్లు, 854 రకాల మోటార్ల అమ్మకాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీపై, పీయూఎస్‌ఎఫ్‌ఐడీసీ నిధుల నుంచి రూ.75 లక్షల నిధులను అక్రమంగా నిధులు కాజేశారని ఆరోపించారు. డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించకపోయినా బిల్లులు ఎత్తడం ఇతర అన్ని విషయాలపై విచారణ చేయించి బాధ్యులను శిక్షించాలని ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి తన లేఖలో ప్రస్తావించారు. ఆ లేఖ ప్రతులను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీకి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్, జిల్లా కలెక్టర్‌కు పంపినట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి మీడియాకు తెలిపారు.

Next Story

Most Viewed