రామరాజ్య స్థాపన పూర్తయిన ఫీలింగ్ వచ్చింది

by Disha Web Desk 15 |
రామరాజ్య స్థాపన పూర్తయిన ఫీలింగ్ వచ్చింది
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : 500 సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం పూర్తి కావడం, అక్కడ రాముల వారి పున:ప్రాతిష్ఠ జరగడం చూస్తుంటే రామరాజ్య స్థాపన పూర్తయిన ఫీలింగ్ వచ్చిందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. మంగళవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కంఠేశ్వర్ వద్ద విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహించారు.

ఈ శోభాయాత్రను ఉదయం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించి మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణం, శ్రీరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగడం ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ గర్వకారణమన్నారు. ఇది ఒక రకంగా హిందువులకు శుభపరిణామమన్నారు. రామమందిరం నిర్మాణం కోసం దశాబ్ధాలుగా కోట్లాడిన సంస్థలకు, వ్యక్తులకు తాను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. రామమందిరం నిర్మాణం తర్వాత శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం ద్వారా రామరాజ్యం కన్నకలలు నెరవేరుతున్నాయన్నారు.

ఈ శోభాయాత్రలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, మహిళా మోర్చ అధ్యక్షురాలు ప్రవళిక, కార్పొరేటర్లు, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ఆలయ ప్రాంగణంలో ప్రారంభమైన ర్యాలీ రాత్రి వరకు సాగింది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 1200 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరం జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మార్మోగింది. ఇందూరు నగరం కాషాయవర్ణమైంది.



Next Story

Most Viewed