ఆర్మూర్ మున్సిపల్ లో అవిశ్వాసం వీగిపోయిందని సోషల్ మీడియాలో పోస్టుల చక్కర్లు

by Sridhar Babu |
ఆర్మూర్ మున్సిపల్ లో అవిశ్వాసం వీగిపోయిందని సోషల్ మీడియాలో పోస్టుల చక్కర్లు
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ పై గత నెల 4 వ తేదీన జరిగిన అవిశ్వాస పరీక్ష పై నెలకొన్న ట్విస్ట్ కు ముగింపు పలికినట్లు సోషల్ మీడియాలో జోరుగా పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ మద్దతు దారులు వీటిని పెడుతున్నారు. ఆర్మూర్ మున్సిపల్ అవిశ్వాస పరీక్షలో ధర్మం గెలిచిందంటూ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ మద్దతుదారులు కామెంట్లు చేస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు కాదని తేల్చిన పురపాలక శాఖ... అంటూ.. ఆర్మూర్ ప్రాంతంలో గల ఆమె మద్దతు దారులు, రాజకీయ విశ్లేషకులు,

క్షత్రీయ కుల బాంధవులు సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెడుతున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పాలకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్ పైన సొంత పార్టీ కౌన్సిలర్లే మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి సహకారంతో గత ఏడాది చివర్లో ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ ను పదవిలోంచి దించేందుకు అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ వినతి పత్రాన్ని ఇచ్చింది అందరికీ తెలిసిందే. సొంత పార్టీ కౌన్సిలర్ల వినతి మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆర్మూర్ ఆర్డీవో, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్లు గత నెల 4వ తేదీన నిర్వహించిన అవిశ్వాస తీర్మాన పరీక్ష విషయంలో ట్విస్ట్ నెలకొంది. శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆర్మూర్ ఏరియాలో

పలువురి ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ లలో సోషల్ మీడియా వేదికగా ఆర్మూర్లో మున్సిపల్ అవిశ్వాసం వీగి పోయిందంటూ.. ధర్మం గెలిచిందంటూ.. మళ్లీ పండిత్ వినీత పవనే ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గా తిరిగి బాధ్యతలు నిర్వహిస్తారు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్మూర్ ఆర్డీవో వినోద్ కుమార్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ అధికారికంగా ఆర్మూర్ మున్సిపల్ అవిశ్వాస పరీక్ష గురించి ప్రకటించాల్సి ఉంది.

Advertisement

Next Story