- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్త లేని సమయాన్ని చూసి గుడిసె తొలగించారు..
దిశ, కామారెడ్డి రూరల్ : బతుకుదెరువు కోసం బయట దేశానికి వెళ్లిన తన భర్త లేని సమయాన్ని చూసి కొంతమంది తాను నివాసం ఉంటున్న గుడిసెను తొలగించారని ఆరోపిస్తూ ఓ మహిళ ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన ఎల్లలత నివాసపు గుడిసెను కొంతమంది ట్రాక్టర్ తో తొలగించారని పేర్కొంది. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కులంలో మాట్లాడుకోమని వారు చెప్పారని, కులంలో మాట్లాడితే గుడిసె కూలగొట్టినందుకు నష్టపరిహారం చెల్లిస్తామని పేర్కొన్నారన్నారు.
తమకు నష్టపరిహారం వద్దని, గుడిసె స్థలం కావాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం తన భర్త బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లాడని, గుడిసె కూల్చివేయడంతో ముగ్గురు చిన్న పిల్లలతో కలిసి తాను చలిలోనే తల దాచుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాలుగా గుడిసెకు గ్రామపంచాయతీలో ఇంటి, నల్లా బిల్లులు కూడా చెల్లిస్తున్నామని తెలిపింది. ఈ విషయమై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరారు.