Case seized: కామారెడ్డిలో నోట్ల కట్టలు కలకలం..రూ.56. 84 లక్షలు సీజ్

by srinivas |   ( Updated:2023-11-29 17:32:58.0  )
Case seized: కామారెడ్డిలో నోట్ల కట్టలు కలకలం..రూ.56. 84 లక్షలు సీజ్
X

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జీవధాన్ స్కూల్ వద్ద డబ్బులు పంచుతున్నారు. ఈ సమాచారం అందుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అక్కడ తనిఖీలు నిర్వహించారు. గూడెం శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వద్ద ఉన్న బ్యాగులో ఉన్న భారీగా నగదు గుర్తించారు. ఇన్‌కమ్ టాక్స్ అధికారి అభిషేక్ శుక్లా ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. బ్యాగులో ఉన్న డబ్బులు బయటకు తీసి లెక్కించారు. మొత్తం మొత్తం 56 లక్షల 84 వేలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వాటిని సీజ్ చేసి తగు చర్యల నిమిత్తం కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గూడెం శ్రీనివాస్ రెడ్డి‌తో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు.

Next Story

Most Viewed