బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం

by Sridhar Babu |
బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. గత ఐదు రోజుల క్రితం మాలపల్లి కి చెందిన మినాజ్ (7)ను కిడ్నాప్ కు పాల్పడిన సోహెల్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ జయరాం తెలిపారు. శనివారం డీసీపీ జయరాం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం మాలపల్లి కి చెందిన మినాజ్ ఇంటి పక్కనే నివాసం ఉండే సోహెల్ జనవరి 30వ తేదీన కిడ్నాప్ కు పాల్పడగా కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు. పోలీసు కమిషనర్ సింగేవార్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు.

అయితే రమేష్ టీం బాలుడి ఇంటి ఆవరణలో గల సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా సో హెల్ అనే వ్యక్తి బైక్ పై తీసుకెళుతున్నట్లు గుర్తించారు. అయితే అక్కడి నుంచి ఆటోనగర్ లోని షేక్ ఆబిద్, షబీనాలకు బాలుడు మినాజ్ ను అప్పగించారు. వారు టీఎస్ 36 ఎఫ్ 8080 కారులో షేక్ అభిద్, షబానా బేగంలు బాలుడిని హైదరాబాద్ కు తీసుకెళ్లారు. కిడ్నాప్ కు పాల్పడిన సోహెల్ ను బాలుడితో సహా హైదరాబాద్ లోని ముస్తాఫానగర్ అన్సారీ రోడ్ ఫలాక్ నామా వద్ద ఎస్సై రమేష్ శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అయితే సోహెల్ ఇంటి పక్కనే ఉన్న బాలుడు మినాజ్ ను అప్పుడప్పుడు కిరాణా షాపునకు తీసుకెళ్లి చాకెట్లు కొనిచ్చేవాడని తెలిసింది.

ఇదే క్రమంలో బాలుడి కిడ్నాప్ కు పాల్పడ్డారని డీసీపీ తెలిపారు. బాలుడి కిడ్పాన్ కు రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారని, దీనిలో సోహెల్ కు రూ.70 వేలు, భార్యభర్తలు షేక్ అబిద్, షబనా బేగంలకు రూ.లక్షా 70 వేలు, ఆలియా కు రూ.10 వేలు ఇచ్చినట్లు నిందితుడు సోహెల్ విచారణలో ఒప్పుకున్నాడన్నారు. అయితే భార్యభర్తలపై గతంలో కేసులు ఉన్నట్లు తెలిసిందన్నారు. బాలుడి కిడ్నాప్ కు ఎవరెవరి పాత్ర ఉందో గుర్తిస్తామని డీసీపీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఏసీపీ కిరణ్ కుమార్, ఎస్ హెచ్ వో విజయ్ బాబు, ఎస్సై రమేష్ ఉన్నారు.

Advertisement

Next Story