ప్రకృతితో మమేకమై తండావాసులు జీవనం

by Sridhar Babu |
ప్రకృతితో మమేకమై తండావాసులు జీవనం
X

దిశ, ఆర్మూర్ : తండాల వాసులు ప్రకృతితో మమేకమై ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తుండ్రు అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలం కల్లెడ గ్రామ పరిధిలో గల కల్లెడ తండా లో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. తొలుత తండా మహిళలు సాంప్రదాయ నృత్యాలతో ఎమ్మెల్యే పైడికి స్వాగతం పలికారు. సేవాలాల్ మహరాజ్ విగ్రహానికి మొక్కులు మొక్కారు.

అనంతరం తండావాసులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తండా అంటేనే ఐక్యమత్యం అని, గిరిజనులు ఎక్కువగా ప్రకృతితో మెలుగుతూ జీవిస్తారన్నారు. ప్రకృతి అంటేనే లంబాడీలని, తండాల అభివృద్ధి కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. తండాల్లో రోడ్లు, డ్రైనేజీలు ఉండే విధంగా చూస్తానని తెలిపారు. అనంతరం సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, మాజీ జెడ్పీటీసీ లతా పిర్ సింగ్, గంగోని సంతోష్, ఎమ్మార్వో, ఎంపీడీఓ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed