విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు.. సబ్ కలెక్టర్ కిరణ్మయి..

by Sumithra |
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు.. సబ్ కలెక్టర్ కిరణ్మయి..
X

దిశ, పిట్లం : విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని పిట్లం మండల అధికారులకు సబ్ కలెక్టర్ కిరణ్మయి హెచ్చరించారు. బుధవారం పిట్లం మండలం కేంద్రంలోని పలు కార్యాలయాలను ఆమె సందర్శించారు. పిట్లం కస్తూర్బా పాఠశాలలో నీటి సమస్య ఉన్నది అన్న సమాచారం మేరకు ఆమె పాఠశాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల డార్మెటరీ, డైనింగ్ హాల్ లను సందర్శించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకునే విధంగా చర్యలు చేపట్టాలని ప్రిన్సిపల్ సరితకు ఆదేశించారు. విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసిన వాటర్ సంపును పరిశీలించి ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించవద్దు..

పిట్లం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో ఏర్పడుతున్న సమస్యల పై పలువురు ఆమెకు వివరించగా వాటి పై స్పందించిన ఆమె హాస్పిటల్స్ కు కావాల్సిన సదుపాయాలను లిఖితపూర్వకంగా రాసి తనకు సమర్పించాలని ఆమె ఆదేశించారు. మూత్రశాలల ఎస్టిమేషన్ రెడీ చేసి తన కార్యాలయానికి పంపించాలని తహశీల్దార్ వేణుగోపాల్ ను ఆదేశించారు. అనంతరం పిట్లం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు న్యాయమైన విద్యను అందించాలని ఆమె ఎంఈఓకు సూచించారు. క్లాస్ రూమ్ లోని విద్యార్థులకు విద్య పై పలు సూచనలు ఆమె చేశారు.

అంగన్వాడి సెంటర్లో పౌష్టికాహారం అందించాలి..

పిట్లం మండల కేంద్రంలో గల 7 నెంబర్ అంగన్వాడి సెంటర్ ను పరిశీలించి దుర్వాసన వెలువడుతుండడంతో వాటిని సక్రమంగా నిర్వర్తించాలని అంగన్వాడి సెంటర్ నిర్వాహకురాలు ప్రవీణకు ఆదేశించారు. చిన్నచిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఎలాంటి వ్యాధులు సోకకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని అంగన్వాడి సూపర్వైజర్ రేణుకకు సూచించారు. సెంటర్లలో నిర్ణీత కాలపరిమితి చెందిన గుడ్లను, పాల డబ్బాలను సంబంధిత టెండరు నిర్వాహకులకు అప్పగించాలని ఆదేశించారు. పిట్లం మండల కేంద్రంలో గల జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో తలెత్తిన సమస్యలు పరిష్కారం అయ్యాయా లేదా అని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రబ్బానిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఎమ్మార్వో వేణుగోపాల్, ఎంపీడీవో కమలాకర్, ఎంపీఓ యాదగిరి, ఆర్ఐ సితాలే, ఎంఈఓ దేవి సింగ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి యాదగిరి వివిధ శాఖలకు చెందిన అధికారులు ఉన్నారు.

Next Story

Most Viewed