- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రదీప్ కుటుంబానికి లక్ష రూపాయలు అందజేసిన ఆర్టిసీ చైర్మెన్..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు ప్రదిప్ కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇటీవల వీధి కుక్కల దాడిలో హైదరాబాదులో మృతి చెందిన ప్రదీప్ స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో బాలుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదివారం పరామర్శించారు.
బతుకు తెరువు కోసం ఊరు వదిలి హైదరాబాద్ లో జీవిస్తున్న గంగాధర్ కుటుంబానికి ఇలా జరగడం బాధాకరం అని అన్నారు. హైకోర్టు తీర్పు తర్వాత కుటుంబానికి ప్రభుత్వం నుండి ఆదుకునే విధంగా కృషి చేస్తానని వెల్లడించారు. ఆ కుటుంబానికి భరోసా కల్పించేందుకు తనవంతు సహాయంగా లక్ష రూపాయల నగదును అందజేశారు. వీధికుక్కల కట్టడి కోసం ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుందన్నారు. మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ తో మాట్లాడి బాలుడి కుటుంబానికి మరింతగా అండగా నిలుస్తామని వెల్లడించారు.