- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Road Repair : బ్రిడ్జి వేశారు.. బీటీ రోడ్డు మరిచారు
దిశ,తాడ్వాయి : వర్షాకాలం వచ్చిందంటే చాలు కాళోజివాడి, బ్రాహ్మణపల్లి శివారులో ఉన్న వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి రవాణా చేయాలంటే భయం గుప్పిట్లో ప్రయాణం చేయాల్సి వస్తుండేది.దీంతో ఆయా గ్రామాల ప్రజలు గత ప్రభుత్వ నాయకుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆ మూడు గ్రామాల ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకుని అప్పటి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ బ్రాహ్మణపల్లి బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.50 కోట్లు, కాళోజివాడి బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.10 కోట్ల నిధులతో 2023 లో గత ప్రభుత్వం మంజూరు చేయించింది.
దీంతో ఆ గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.కాళోజివాడి, బ్రాహ్మణపల్లి గ్రామాల శివారులో నూతన బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించారు. పనులు చేపట్టిన కొద్ది రోజులకే అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో కొన్ని రోజులు పనులు నిలిచి నిలిచి పోయాయి.మళ్లీ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు.కానీ,దానిపై బిటి రోడ్డు వేయడం మర్చిపోయారు.దీంతో గుత్తేదారుడు పనులు మధ్యలోనే వదిలేసి వెళ్లడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గత మూడు రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలతో బ్రిడ్జి పైన పోసిన మట్టి బురదమయంగా మారడంతో ద్విచక్ర వాహనదారులు జారీ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.కాళోజివాడి, బ్రాహ్మణపల్లి గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు నిత్య కష్టాలు ప్రారంభమయ్యాయి.
కామారెడ్డి జిల్లా కు వెళ్లాలంటే అవస్థ..
కాళోజివాడి,బ్రాహ్మణపల్లి గ్రామ శివారుల మధ్య నిర్మాణం చేపట్టిన బ్రిడ్జి పై మట్టి పోసి వదిలేయడంతో వర్షాలకు బురదమయంగా మారింది.దీంతో జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే ఆయా గ్రామల ప్రజలు నిత్యం ఇబ్బందులు పడాల్సి వస్తోంది.ప్రతి రోజు ద్విచక్ర వాహనదారులు, ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. కాళోజివాడి బ్రాహ్మణపల్లి గ్రామాలకు కామారెడ్డి జిల్లా అతి సమీపంలో ఉండడంతో గ్రామాల నుంచి విద్యార్థులు, ఉద్యోగస్థులు, రైతులు వివిధ పనుల రీత్యా ప్రయాణం సాగిస్తుంటారు.స్థానిక ఎమ్మెల్యే ఆయా గ్రామాలను దృష్టిలో ఉంచుకుని బిటి రోడ్డు పనులు చేపట్టే విధంగా చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి : దాసు కాళోజివాడి గ్రామస్థుడు
బ్రిడ్జి పైనుంచి వాహనాలు, ద్విచక్ర వాహనాలు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బ్రిడ్జి పైన ఉన్న మట్టి వేసి వదిలేయడంతో బురదమయంగా మరి ప్రమాదాలు సంభవిస్తున్నాయి.ఇప్పటికైనా బిటి రోడ్డు వేసేలా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి.
ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు పనులు చేస్తాం :రవితేజ ఏఈ,ఆర్ అండ్ బి
కాలోజువాడి,బ్రాహ్మణపల్లి, గ్రామాల్లో బ్రిడ్జిల నిర్మాణం ఉన్న వాటిపై బీటీ రోడ్డు వేయకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. బ్రిడ్జి నిర్మాణ పనులు 80శాతం పనులు జరిగాయి.మిగిలిన పనులు వెంటనే చెప్పట్టి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయిస్తాం.