పార్లమెంట్ ఎన్నికల బరిలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి.. స్వాతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్

by Disha Web Desk 12 |
పార్లమెంట్ ఎన్నికల బరిలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి.. స్వాతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా.. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి రాపల్లి సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఉన్న రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1995 సంవత్సరం నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నిర్లక్ష్యం వహించాయన్నారు. ఆయా పార్టీలు రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని పావులుగా మార్చుకుంటున్నారేగాని.. కనీసం తమకు పెన్షన్ కూడా మంజూరు చేయడం లేదని ఆయన విమర్శించారు. అందుకే అన్ని పార్టీలకు నిరసనగా పార్లమెంట్‌లో ఆర్టీసీ, ఇతర కార్పొరేషన్ సంస్థలైన రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పార్లమెంట్ సాక్షిగా తన గొంతుకనై వినిపిస్తానన్నారు.

అలాగే తాను 1995లో పెన్షన్ 7,500 డిఎ ఇవ్వాలని కొట్లాడుతూ.. వస్తున్నామని, ఈ విషయంలో పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీలో గతంలో మాజీ కేంద్రమంత్రికి పలుమార్లు విన్నవించిన ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఈ కారణంతోనే తమ గలాన్ని వినిపించడానికి పార్లమెంట్‌లో ఎంపీ అభ్యర్థిగా నిలబడి తమ సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు బస్సు డిపోల వారీగా పదిహేను వేల రిటైర్డ్ ఉద్యోగుల మద్దతు తమకు ఉందని, అయితే జాతీయస్థాయిలో రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు అశోక్ రావత్ తమ సమస్యలపై ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్షలు సైతం చేపట్టిన దాఖలాలు ఉన్నాయని, ఆయన రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల గళాన్ని వినిపించడానికి నేను ఎంపీగా పోటీ చేస్తున్నానని, రిటైర్డ్ ఉద్యోగులతో పాటు ప్రతి ఒక్కరి మద్దతు తనకు ఉండాలని ఆయన కోరారు.

Next Story