పెత్ర అమావాస్యకు షాక్ ఇచ్చిన గాంధీ తాత..

by Sumithra |
పెత్ర అమావాస్యకు షాక్ ఇచ్చిన గాంధీ తాత..
X

దిశ, గాంధారి : సంవత్సరానికి ఒకసారి పెద్దలకు నైవేద్యంగా పెట్టుకునే పెత్ర అమావాస్య పండగ, అదే రోజు గాంధీ తాత జయంతి కావడంతో అందరికీ గాంధీ తాత షాక్ ఇచ్చినట్లు అయింది. పెద్దలకు చనిపోయిన తమ కుటుంబ సభ్యులకు నైవేద్యంగా పెట్టే రోజే పెత్రమాస కావడం, అదే రోజు గాంధీ జయంతి కావడం పట్ల అటు మాంసాహారం, మద్యం రెండు బంద్ ఉండడంతో పెత్ర అమావాస్య జరుపుకునేది ఎట్లా అనే ఆలోచనలో పడ్డారు అందరూ. వాస్తవానికి అమావాస్య బుధవారం ఉండడంతో దాదాపు అందరూ బుధవారం జరుపుకుందాం అని ధోరణిలో ఉన్నారు. కానీ అదే రోజు గాంధీ జయంతి కావడంతో సుక్కా ముక్కలకు స్వస్తి చెప్పాల్సింది ఉండగా చేయాల్సిందేమీ లేక పండగను ఒక రోజు ముందు ఒకరోజు వెనక జరుపుకోలేక తప్పడం లేదు. పెద్దల పట్ల ప్రేమ ఉండి ఎంతో ఇష్టంగా వారికి మాంసం మద్యం రెండు నైవేద్యంగా పెట్టి ఇంట్లో వారందరినీ పిలిచి పోయిన వారిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ జరుపుకునే పండగ పూట ఇలా కావడం పట్ల అందరూ అవాక్కవుతున్నారు.

తగ్గేదేలే.. తినుడు తినుడే.. తాగుడు తాగుడే...

పెద్దలకు పెట్టుకునే పండుగ అయిన పెత్ర అమావాస్య బుధవారం కాకపోతే ఒకరోజు ముందు లేకపోతే ఒకరోజు తర్వాత అంటే మంగళవారం లేకపోతే గురువారం జరుపుకోవడం తప్పనిసరి. ఏరోజైనా తినడంలో, తాగడంలో తగ్గేదే లేదంటున్నారు. పెత్ర అమావాస్య జరుపుకునే కుటుంబాలు.

గురువారం జరుపుకోవద్దు మంగళవారమే శ్రేయస్కరమంటున్న పంతుళ్ళు..

పెద్దలకు పెట్టుకునే సంవత్సర నైవేద్య పండగ గురువారం నైవేద్యం ఎక్కదని కాబట్టి మంగళవారం రోజు జరుపుకోవడమే శ్రేయస్కరమని పంతుళ్లు చెబుతున్నారు. పంతులు చెప్పిందాన్ని ఆచరించి దాదాపు అందరూ కూడా మంగళవారమే పెద్దలకు జరుపుకునే పండగ జరుపుకోవాలని నిశ్చయించుకున్నారు. ఏదేమైనా బహుశా గాంధీ తాత కూడా కోపం వచ్చింది కాబోలు.. అందుకే ఇలా చేశారు కాబోలు.

Advertisement

Next Story

Most Viewed