ఆశావాహుల్లో పంచాయతీ ఎన్నికల అలజడి..

by Aamani |
ఆశావాహుల్లో పంచాయతీ ఎన్నికల అలజడి..
X

దిశ,పిట్లం : రానున్న పంచాయతీ, సమస్థా గత ఎన్నికలకు ప్రభుత్వం వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తున్న తరుణంలో ఎన్నికల్లో నిలిచే ఆశావాహుల్లో అలజడి మొదలైంది. ఎన్నికల కసరత్తు లో భాగంగా ఇప్పటికే వార్డు, గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా విడుదల కావడంతో గ్రామాలలో ఒకసారిగా ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన బరిలో నిలిచేందుకు ఆశావాహులు సిద్ధమవుతున్నారు. ఓటర్ల జాబితాను పరిశీలించిన ఆశవాహులు రిజర్వేషన్లపై సామాజిక వర్గాలపై ప్రలోభాల కార్యక్రమం మొదలు పెట్టినట్లు సమాచారం. స్థానిక ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. అయినప్పటికీ రూలింగ్ పార్టీలో ఉన్న నాయకులు గ్రామాలలో పార్టీ మద్దతు తమకే ఉంటుందన్న సమాచారంతో ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టుకుంటున్నారు.

రిజర్వేషన్లపై ఉత్కంఠ..

స్థానిక ఎన్నికలను సంక్రాంతి పండుగలోగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇప్పటికే దీనిపైన కుల గణన సర్వే కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో సర్వేల ఆధారంగా బీసీ రిజర్వేషన్లు నిర్ణయించనున్నది. దీంతో పంచాయతీ ఎన్నికలపై బీసీల ఆశావాహులకు రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది.

ప్రజల్లోకి ఆశావాహులు..

ఎన్నికల బరిలో నిల్వాలనుకున్న ఆశావాహులు ఇప్పటి నుండే ప్రజలను ఆకర్షించే పనిలో పడుతున్నారు. గ్రామాల్లో జరిగే చిన్న,చితక శుభా, ఆశుభ కార్యాక్రమంలో పాల్గొంటు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల మద్దతు సంపాదించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ప్రజల్లో పేరు ఉన్న తాజా, మాజీ నాయకులు ప్రజల మద్దతును సంపాదించే విధంగా చర్యలు చేపట్టగా, రూలింగ్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు తమనుగెలిపిస్తేనే ప్రజలకు పనులు జరుగుతాయన్న ఆశలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.

అధికార పార్టీలోనే ఆశావాహుల జోరు..

స్థానిక ఎన్నికలకు పోటీలో నిలిచేందుకు అధికార పార్టీకి చెందిన నాయకుల మధ్యనే పోటీ జోరుగా ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఎవరికి వారే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. గతంలో నిర్వహించిన ఎన్నికల్లో అధికార పార్టీలో ఉన్న నాయకులే 90% స్థానిక ఎన్నికల గెలుపొందారు. దీంతో అధికార పార్టీలో ఉన్న నాయకులు స్థానిక ఎమ్మెల్యే మద్దతు కోసం ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు.

Advertisement

Next Story