ఆర్మూర్‌లో బిజెపి శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించిన పైడి రాకేష్ రెడ్డి

by Mahesh |
ఆర్మూర్‌లో బిజెపి శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించిన పైడి రాకేష్ రెడ్డి
X

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార చివరి రోజు అయిన మంగళవారం బీజేపీ శ్రేణులు ఆర్మూర్‌లో కదం తొక్కారు. బీజేపీ శ్రేణుల భారీ ర్యాలీతో ఆర్మూర్ పట్టణం కాషాయ మయమైంది. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి మంగళవారం ఆర్మూర్‌లో విసృతంగా ప్రచారం చేశారు. ఆర్మూర్‌లో బీజేపీ సీనియర్ నాయకులతో కలిసి మామిడిపల్లి చౌరస్తా నుండి గోల్ బంగ్లా వరకు వేలాది బీజేపీ శ్రేణులతో పాదయాత్రగా వెళ్లారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి నడుస్తున్నా యద్దం నడుస్తుందన్నారు. ఆర్మూర్ ప్రజలు అహంకారానికి, ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికలు గా భావించి తనను ఆశీర్వదించాలని పైడి రాకేష్ రెడ్డి కోరారు. ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాది లోపల ఇండ్ల నిర్మాణం ప్రారంభించకపోతే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆర్మూర్ ప్రజల సమక్షంలో ప్రకటించారు. ఇదివరకు ఉన్న ఎమ్మెల్యే లాగా ఇండ్ల కోసం పదేళ్ల సమయం తీసుకునే అవసరం తనకు లేదన్నారు.

ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిలో నియోజకవర్గంలో నిరుపేదలకు ఇండ్ల నిర్మాణాలు ప్రారంభిస్తాం అన్నారు. ఆర్మూర్‌లో నిజాయితీ పాలన చేస్తానని,,, అవినీతి చేసిన రోజు చావడానికి కూడా సిద్ధం అన్నారు. తను ఆస్తులు సంపాదించుకోవడం కోసం రాజకీయాల్లోకి రావడం లేదని, ప్రజలకు తన చేతనైనంత సాయం చేసేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు పైడి చెప్పారు. ఒక్క అవకాశం ఇచ్చి తనను ఆశీర్వదించి ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలిపించాలని, ఆర్మూర్‌ను అన్ని రంగాలుగా అభివృద్ధి చేస్తానని పైడి రాకేష్ రెడ్డి అన్నారు. అనంతరం రాకేష్ రెడ్డి స్వగ్రామం అంకాపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువత, మహిళలు, వృద్దులు వెలదిగా తరలివచ్చారు.

ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడే పుట్టిన ఇక్కడే చస్తా ఈ ప్రాంతం కోసం బతుకుతాను అని అంకాపూర్ రక్తం ఉన్నవాడిని నన్ను ఆదరించండి. అంకాపూర్ పేరు అంటే బ్రాండ్.. అలాగే నేను కూడా ఓ బ్రాండ్ ల పనిచేసి ఊరు పేరును నిలుపుతానని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ మంత్రి రాజేందర్ శుక్ల, త్రిపాఠి, పల్లె గంగారెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, పాలెపు రాజు, యామాద్రి భాస్కర్, కంచెట్టి గంగాధర్, జీవి. నరసింహారెడ్డి, ఆకుల శ్రీనివాస్, కలిగోట్ గంగాధర్, ఆకుల జాగిర్దాస్ శ్రీనివాస్, పాల భాస్కర్, కేసి ముత్తెన్న, జై డి శ్రీనివాస్ రెడ్డి, మంతెన గంగారం, దేగం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed