- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశ్రాంతి ఉపాధ్యాయులకు సన్మానం..
దిశ, నిజామాబాద్ సిటీ : బదిలీలు ప్రమోషన్లు ఇప్పించిన ఘనత పీఆర్ టీయూటీఎస్ సంఘానిదే అని నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. గురువారం పీఆర్టీయుటీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పీఆర్టీయుటీఎస్ సంఘానికి ఉపాధ్యాయులకు ఎనలేని సేవలను అందించిన విశ్రాంత ఉపాధ్యాయులైన సుధాకర్ రావు, మహేందర్ రెడ్డి, వేణుగోపాల్ స్వామి, ముత్తెన్న, శంకర్ గౌడ్ లను సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ బదిలీలు ప్రమోషన్లు ఇప్పించిన ఘనత పీఆర్టీయుటీఎస్ సంఘానిదేనని, భవిష్యత్తులో సీపీఎస్ ను అంతం చేసేది, ఉపాధ్యాయులకు అన్ని సౌకర్యాలు ఇప్పించేది ఈ సంఘమే అని అన్నారు.
ఎన్నో రోజులుగా ఉపాధ్యాయులు కోరుకుంటునటువంటి బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టడం బదిలీలు, ప్రమోషన్లు ఇప్పిస్తామని చెప్పి చేయిస్తున్న ఘనత ఒక పీఆర్టీయూ సంఘానిదే అని, విద్యారంగ సంక్షేమమే ద్యేయంగా సంఘం పని చేస్తున్నదని తెలిపారు. సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుల్లాంటి నాయకులు ఉన్న సంఘం ఒక్క పీఆర్టీయు సంఘమే అని తెలుపుతూ ఉపాధ్యాయుల జీవన ప్రమాణాలు ఈరోజు ఇంత ఉన్నతంగా ఉన్నాయంటే అది పీఆర్టీయు చేసిన కృషి ఫలితమే అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ అధ్యక్షులు మాధుసూదన్ రెడ్డి, పీఆర్టీయు నాయకులు రాధ, ఆశారాణి, ప్రతాప్ రెడ్డి, రచ్చ మురళి, కిషన్, హన్మరెడ్డి, సుధాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సోమలింగం, సాయిరెడ్డి, చిలుక శ్రీనివాస్, దేవరెడ్డి, రాజేందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, ప్రసాద్, రామచందర్, శ్రీనివాస్, రవి, రవినాయక్, ఆశ్రర్, హన్మండ్లు, శ్రీనివాస్ గౌడ్, రమేష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.