500‌కే గ్యాస్ ఇవ్వడం లేదు.. కేవలం ఈ కేవైసీ మాత్రమే

by Mahesh |
500‌కే గ్యాస్ ఇవ్వడం లేదు.. కేవలం ఈ కేవైసీ మాత్రమే
X

దిశ, నవీపేట్ : కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారని ప్రతీ గ్యాస్ వినియోగదారులు వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని రూమర్స్‌ వచ్చాయి. దీంతో మండల కేంద్రంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద తెల్లవారుజామున 5 గంటల నుంచి వినియోగదారులు బారులు తీరుతున్నారు. ఈ కేవైసీ పై సదరు భారత్ గ్యాస్ ఏజెన్సీ వినియోగదారులకు అవగాహన అవగాహన కల్పించకపోవడంతో గత మూడు రోజుల నుంచి వందల సంఖ్యలో మహిళలు, వినియోగదారులు ఉదయం నుంచి లైన్ కడుతున్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుండే కాకుండా రెంజల్ మండలం నుంచి కూడా వినియోగదారులు వస్తున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఉదయం 10.30 గం. నుండి సాయంత్రం 4.30 వరకు మాత్రమే అని బోర్డు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు.

సోమవారం వందల సంఖ్యలో వచ్చిన కస్టమర్లను అదుపు చేయలేకపోవడంతో పోలీసులు వచ్చి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం 6 గంటల వరకు పదుల సంఖ్యలో వస్తున్న మహిళలు పది గంటల వరకు వందల సంఖ్యలో గుమి గూడుతున్నారు. వందల సంఖ్యలో వస్తున్న వినియోగదారులను ఈ కేవైసీ చేయడానికి తగిన వనరులను ఏర్పాటు చేయకపోవడం, ఒక్కరే కంప్యూటర్ ఆపరేటర్‌తో రోజుకు 10 నుండి 20 మంది కస్టమర్స్ ఈకేవైసీ చేస్తూ మిగతా వారికి వాపస్ పంపుతున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లను పెంచి త్వరగా పూర్తి చేయాలని గ్యాస్ కస్టమర్లు కోరుతున్నారు.

ఈ కేవైసీ కి నిర్ణీత గడువు లేదు..

గ్యాస్ వినియోగదారుల ఈకేవైసీ కి ఎలాంటి గడువు లేదని ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చనే విషయం వినియోగదారులు గమనించాలని ఏజెన్సీ నిర్వాహకులు కోరుతున్నారు.

Advertisement

Next Story