- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సార్ ని కలవాల్సిందే: డిప్యూటేషన్ ఉండాలన్న.. వేతనం రావాలన్నా
వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న హెల్త్ సూపర్ వైజర్ ఒకరు గత నెల అనారోగ్యంతో చనిపోయాడు. తాను పని చేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అతన్ని సూపర్ వైజర్ విధులకన్నా గార్డెనింగ్ పనులు చేయాలని కోరడంతో అతన్ను నిరాకరించడంతో 22 నెలలుగా వేతనం రాకపోవడంతో అతను మానసికంగా కుంగిపోయి చనిపోయారు. ఈ విషయంలో డీఎంహెచ్ వో విచారణ జరిపి వేతనాలు ఇవ్వాలని డాక్టర్ వార్నింగ్ ఇచ్చినా జీతం రాకపోవడం అతన్ని జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి వేతనం లేకుండా చనిపోవడంతో అతని కుటుంబం రోడ్డున పడింది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మౌనం దాల్చడంతో పరిస్థితి దారుణంగా తయారైంది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఒక విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులు చేస్తున్న పని తీరుపై ప్రభుత్వం ఇటీవల కేంద్ర ప్రభుత్వం జిల్లాకు గోల్డ్ మెడల్ ను ప్రకటించింది. ఆ సంబురం ఆ ఉద్యోగులకు లేకుండాపోయింది. ఎందుకంటే అందులో పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సంబంధిత ఫొటోలను గ్రూప్ లో అప్ లోడ్ చేయాలేదన్న కారణంతో 15 మందికి 3 నుంచి 4 రోజుల వేతనాన్ని కోతలు విధించడం విశేషం. దానిపై బాధితులు సంబంధిత విభాగం హెడ్ ను కలువగా సార్ ను కలువాలని చావు కబురు చల్లగా చెప్పారు.
బోధన్ డివిజన్ లో పని చేసే ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఇటీవల హజ్ యాత్ర చేశాడు. అందు కు సంబంధించిన సెలవును కూడా పెట్టాడు. కానీ దానిని అంగీకరించకుండా అతన్ని సెలవు ను పరిగణలోకి తీసుకోకుండా వేతనంలో కోత విధించారు. ఈ విషయంలో బాధితుడు జిల్లా కలెక్టర్ ను ఫిర్యాదు చేయగా సీఎల్ గా పరిగణించాలని ఆదేశించడం విశేషం. చుట్టు ప్రక్క ల ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న హెల్త్ సూపర్ వైజర్ కు గత కొంత కాలం క్రితం వైద్య ఆరోగ్యశాఖాధికారులు డిప్యూటేషన్ విధించారు. డిప్యూటేషన్ పై పని చేస్తున్న మహిళ ఉద్యోగిని పిహెచ్ సీల చుట్టురా తిప్పడం విశేషం.
నిజామాబాద్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఒక యూపీహెచ్ సీలో పని చేస్తున్న ఒక ఉద్యోగి తన అవసరం నిమిత్తం మూడు రోజుల సెలవు పై వెళ్లింది. ఈ విషయంలో సంబంధిత పీహెచ్ సీ వైద్యులకు సమాచారం అందించింది. తోటి ఉద్యోగుల ద్వారా లీవు లెటర్ ను పంపింది. దా నిని సాధారణంగా సీఎల్ గా పరిగణించి వేత నం ఇవ్వాల్సిన అధికారులు మూడు రోజుల వేతనం కోత విధించారు. ఈ విషయం లో సా రును కలువాలని ఉచిత సలహా ఇచ్చారని బాధితురాలు వాపోతున్నారు. ఈ యేడాది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులో ఉద్యోగులను డిప్యూటేషన్ ఉండాలంటే సారును కలువాలని చెప్పినట్లు తెలిసింది. ప్రభుత్వం చేపట్టిన ఆ ప్రాజెక్టు రెండవ విడత పూర్తి కావడంతో అందు లో పని చేస్తున్న డిప్యూటేషన్ ఉద్యోగులు సారు ను కలువాలని లేకపోతే డిప్యూటేషన్ క్యాన్సల్ అవుతుందని బెదిరించినట్లు తెలిసింది.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ‘సార్‘ కలువడం అన్న ట్రెండ్ జోరుగా సాగుతుంది. ప్రధానంగా డిప్యూటేషన్లు మొదలుకుని ఏ పనికైనా కచ్చితం గా సారును కలువాల్సిందే. సార్ ను కలువకుండా డిప్యూటేషన్లు ఉండవు ఉన్నా ఎక్కడ విధులు నిర్వహించాలో తెలియక ఉద్యోగులు సతమతమవుతున్నారు. నిజామాబాద్ వైద్య ఆరోగ్యశాఖలో ఈ తతంగం కొనసాగుతుంది. ఇటీవల కాలంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన అధికారులపై ఆరోపణలు రాగా వాటిపై గత కలెక్టర్ విచారణ చేపట్టిన చర్యలు తీసుకోకుండా నే ఆయన బదిలీ కావడంతో మళ్లీ అక్కడ ‘సార్‘ పేరిట కాసుల వసూళ్ల పర్వం ప్రారంభమైంది. వైద్య ఆరోగ్యశాఖలో పదోన్నతి పొందిన టెక్నిక ల్ నాలెడ్జ్ లేని ఓ ఉద్యోగి ఈ తతంగాన్ని నడుపుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న వారు ఆరోపిస్తున్నారు. ఓ ఉద్యోగి 22 నెలల వేతనం లేకుండా ఇళ్లు గడువక ఆత్మనూన్యతతో ఎవరికి చెప్పుకోలేక తనువు చాలించడం వైద్య ఆరోగ్య శాఖలో దాష్టీకాలకు పరాకాష్టగా చెప్పవచ్చు. గతంలో ఏసీబీ దాడుల్లో వైద్య ఆరోగ్య శాఖాధికారితో పాటు ఏవో వరకు దొరికిన తీరు మాత్రం మారడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా వైద్య ఆరోగ్యశాఖాధికారులు లైటుగా తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఈ విషయంపై ఫ్యామిలీ హెల్త్ కమిషనర్ కు ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నారు.