- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహారాష్ట్రలో కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి..
దిశ, ఆర్మూర్ : ఈనెల 26వ తేదీన మహారాష్ట్రలోని కాందార్ లోహలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే భారీబహిరంగ సభ స్థలం, ఏర్పాట్లను మహారాష్ట్ర స్థానిక నేతలతో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ ఛైర్మన్, నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి శుక్రవారం పర్యవేక్షించారు. ఈ నెల 26న మహారాష్ట్రలోని కాందార్ లోహలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర లోని కాందార్ లోహకి చేరుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్కడ సభాస్థలాన్ని, చేయవలసిన ఏర్పాట్ల గురించి స్థానిక నేతలలో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హిమాన్షు తివారి (బీఆర్ఎస్ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ), మాణిక్ కదం (బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర కిషన్ సెల్ అధ్యక్షుడు), ప్రవీణ్, శివాన్క్, అంకిత్ యాదవ్, గణేష్ బాబురావు కదం, తదితరులు పాల్గొన్నారు.