'ఆర్మూర్‌లో బీఆర్ఎస్‌కు ఏమైంది..?'.. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్‌‌కు వరుస షాక్‌లు

by Vinod kumar |
ఆర్మూర్‌లో బీఆర్ఎస్‌కు ఏమైంది..?.. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్‌‌కు వరుస షాక్‌లు
X

దిశ, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు, ప్రజా ప్రతినిధులు అత్యంత రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతంలో కలవారు. ఇలాంటి రాజకీయ చైతన్యం కేంద్రంగా గల ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీలో నేతల రాజీనామాలతో ఆ పార్టీ నియోజకవర్గ నాయకుల్లో కలవరం మొదలైంది. 2014 బీఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశన్న జీవన్ రెడ్డి పేరు రాష్ట్రంలో తొలిసారిగా ప్రకటించడంతో జీవన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అంతకుముందు ఆర్మూర్‌లో విశాఖ కాలనీ, నిమ్మల గార్డెన్ మధ్యలో అప్పట్లో టీఆర్ఎస్ ఆవిర్భావ సభను జీవన్ రెడ్డి అదిరేలా నిర్వహించడంతో సీఎం కేసీఆర్ దృష్టిలో జీవన్ రెడ్డి అప్పటి నుంచి పడ్డారు.ఇది క్రమేనా 2014లో ఆర్మూర్ అభ్యర్థిగా ఉద్యమ నేత కేసిఆర్ రాష్ట్రంలో మొట్టమొదటిగా జీవన్ రెడ్డి పేరు ప్రకటించడానికి దారితీసింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమ, అభివృద్ధి పంతాలో రెండు మార్లు ఆర్మూర్ ప్రాంత ప్రజల అభిమానాన్ని చురగొని ఆర్మూర్ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి విజయాలు సాధించారు.

కానీ 2023 ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్ ఆర్మూర్ అభ్యర్థిగా ఆశన్న గారి జీవన్ రెడ్డి పేరునే సీఎం కేసీఆర్ ప్రకటించారు. తర్వాత తొలిసారిగా ఆర్మూర్‌కి రెండు నెలల క్రితం జీవన్ రెడ్డి వచ్చి ఆర్మూర్‌లో అట్టహాసంగా ప్రజా ఆశీర్వాద ర్యాలీకి జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుగా హాజరై మాట్లాడి బీఆర్ఎస్ లో నూతన ఉత్తేజాన్ని నింపారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశన్న గారి జీవన్ రెడ్డి ప్రచార పర్వాన్ని హోరెత్తించారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో ప్రజాప్రతినిధులు, నాయకులు ఒక్కొక్కరుగా ఇతర ప్రతిపక్ష పార్టీల్లో చేరారు. కాగా నిన్నటి రోజు ప్రతిపక్ష పార్టీల్లో చేరిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నయాన్నో, భయాన్నో తిరిగి వారికి బీఆర్ఎస్ పార్టీ కండువాలను వేసి తిరిగి వారి పార్టీలోకి ఆహ్వానించారు.

బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు వరుస కట్టి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేసి.. ఇతర ప్రతిపక్ష పార్టీల్లో చేరి ఆయా పార్టీల కండువాలను కప్పు కుంటుండంతో ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతుందన్న చర్చ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల్లో జోరుగా సాగుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు రోజుల ఎవరి ఉండడంతో బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిలో ఇంకెందరు నాయకులు ఉన్నారని అంటూ రాజకీయ ప్రముఖుల్లో జరుగుతున్న చర్చ ఆర్మూర్‌లో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగలడంతో ఆర్మూర్ గులాబీ శిబిరాన్ని తీవ్ర గందరగోళానికి గురిచేస్తుంది. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ తోపాటు, అన్ని మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన సంఘాల సభ్యులు గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతూ కమలం, హస్తం పార్టీలో చేరుతుండడంపై ఆర్మూర్‌లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటన్న చర్చ ఆర్మూర్ నియోజకవర్గ రాజకీయ విశ్లేషకుల్లో తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఆర్మూర్ నియోజకవర్గంలో గులాబీ పార్టీని వీడుతూ హస్తం, కమలం పార్టీలో నేతలు నాయకులు పలు సభ్యులు చేరడంపై కారు పార్టీ నేతలకు తలనొప్పిగా మారిందనే అభిప్రాయాలు ఆర్మూర్‌లో జోరుగా వినబడుతున్నాయి.

బీఆర్ఎస్‌కు వరుస కట్టి షాక్‌లు..

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పెంట ఇంద్రుడు ఆధ్వర్యంలో ఐలాపూర్ ఎంపీటీసీ బల్గం రవి మంగళవారం బీఆర్‌ఎస్‌కి రాజీనామా చేసి మాజీ మంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రదేష్ కాంగ్రెస్ కోశాధికారి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా, సుదర్శన్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిప్పెర సాయిరెడ్డి, చింరాజుపల్లి ఎంపిటిసి శ్రీను, ఐలాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రవి పాల్గొన్నారు.

Next Story

Most Viewed