పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేటీఆర్ జైలుకే

by Sridhar Babu |
పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేటీఆర్ జైలుకే
X

దిశ, కామారెడ్డి క్రైమ్ : పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని, అలాగే లిక్కర్ స్కామ్ లో జైలు శిక్ష అనుభవిస్తున్న కవిత బయటకు వచ్చే అవకాశం లేదని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీ ఎన్నికల అనంతరం కేటీఆర్ జైలుకు పోవడం ఖాయం అన్నారు. కేటీఆర్ తో పాటు మరికొంత మంది ముఖ్య బీఆర్ఎస్ నాయకులు జైలుకు వెళ్లడం ఖాయం అని అన్నారు.

కవిత లిక్కర్​ స్కామ్ తోపాటు మరికొన్ని స్కామ్ లతో సూత్రధారని, భూ కంభకోణాలు కూడా బయటపడుతున్నాయని అన్నారు. గత ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పోలీసు వాహనాలలో డబ్బులు తరలించడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగువుతుందన్నారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కూడా రైతులను పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు రైతుల పట్ల ముసలి కన్నీళ్లు కారుస్తుందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని తెలిపారు.

Advertisement

Next Story