- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంటి వెలుగు శిబిరాలను సక్రమంగా నిర్వహించాలి..
దిశ, బాన్సువాడ : జిల్లాలో కంటి వెలుగు శిబిరాలను నిర్దిష్ట ప్రణాళికకు అనుగుణంగా సజావుగా నిర్వహించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. గురువారం ఆయన వర్ని మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. శిబిరానికి తరలివచ్చిన వారికి నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. శిబిరం వద్ద అందుబాటులో ఉంచిన సదుపాయాలు గమనించి సంతృప్తి వ్యక్తం చేశారు. కంటి అద్దాలు, మందుల నిల్వల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలందించాలని వైద్యులు, సిబ్బందికి హితవు పలికారు. పక్కాగా కంటి పరీక్షలు జరుపుతూ, అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులు అందించాలని సూచించారు.
శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం వర్ని మండలం వడ్డేపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న మన ఊరు-మన బడి పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. కొత్తగా చేపట్టనున్న అదనపు తరగతి గదులు, టాయిలెట్స్, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్ తో పాటు మినీస్టేడియం నిర్మాణం కోసం నిర్దేశించిన స్థలాన్ని అయన పరిశీలించారు. పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యల గురించి స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తేగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని సానుకూలంగా స్పందించారు. పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులోపు పూర్తయ్యేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు.