అంతర్జాతీయ కౌశల్ మహోత్సవ్ కార్యక్రమం.. విదేశాల్లో పనిచేయుటకు దరఖాస్తులకు ఆహ్వానం

by Mahesh |
అంతర్జాతీయ కౌశల్ మహోత్సవ్ కార్యక్రమం.. విదేశాల్లో పనిచేయుటకు దరఖాస్తులకు ఆహ్వానం
X

దిశ, నిజామాబాద్ సిటీ: వివిధ రంగాల నైపుణ్యాలలో ప్రతిభ ఉన్న భారత యువత విదేశాల్లో పనిచేయుటకు భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రీప్రినీర్షిప్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు అంతర్జాతీయ కౌశల్ మహోత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని జిల్లా కన్వీనర్, ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపాల్ ఎం.కోటి రెడ్డి ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువత చివరి తేదీ 9వ ఏప్రిల్ వరకు ఉచితంగా https://www.kaushalm ahostav.nsdcdigital.org/international/Candidate/ నందు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇట్టి నమోదుకు ఎలాంటి వయస్సు పరిమితులు లేవని తెలిపారు.

Automotive, International Cruise Liners, Agriculture & Horticulture, IT, Carpenters, Logistics, Construction, Mechanics, Drivers and Riders, Oil & Gas, Electricians, Plumbers, Extraction workers, Refrigeration, Facility Management, Retail & Service Delivery, Food & Beverage, Shipyard/Marine, Healthcare, Technicians, Hospitality, Trade, HVAC, Welders రంగాలలో నైపుణ్యం కలిగి ఎస్ ఎస్ సి, ఐ టి ఐ,ఇంటర్ (రెగ్యులర్/ఓకేషనల్), ఏదైనా డిగ్రీ

నర్సింగ్, (హెవీ మోటర్ డ్రైవింగ్ లైసెన్స్) విద్య అర్హతలు కలిగి ఉన్నవారు నమోదు చేసుకోవాలని మరియు స్క్రీనింగ్ టెస్ట్ హైదరాబాద్ లో జరుగునని తెలిపారు. పూర్తి వివరాలకు 8800055555, 18001239626 సంప్రదించాలని తెలిపారు. నమోదుకు కావలసిన పత్రాలు:

1.ఐడెంటిటీ ప్రూఫ్ (పాస్ పోర్ట్, ఆధార్ కార్డు)

2.ఎడ్యుకేషన్ సర్టిఫికెట్

3.వర్క్ అనుభవం.

4.అవసరమైన సర్టిఫికెట్స్

5.పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫొటోస్ 6. లాంగ్వేజ్ అసెస్మెంట్ సర్టిఫికెట్.

7. ట్రేడ్ అసెస్మెంట్ సర్టిఫికెట్

8. లీగల్ డాక్యుమెంట్స్( క్లియరెన్స్ సర్టిఫికెట్, మెడికల్ సర్టిఫికెట్,ఒకేషనల్ సర్టిఫికేట్, ఎన్ఓసి.

9. డాక్యుమెంట్లపై అటే స్టేషన్ తప్పనిసరి అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed