- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇందిరమ్మ రాజ్యం రావాలి
దిశ, ఎల్లారెడ్డి : తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలంగాణ ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అబ్జార్వార్ జెట్టి కుసుమ కుమార్ తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 3న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు తీరుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పేరిట లక్షల కోట్ల రూపాయలను కొల్లగొట్టిన బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఎన్నికల్లో గెలవగానే ప్రజల సొమ్మును కొల్లగొట్టిన
వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గా మదన్ మోహన్ రావు భారీ మెజారిటీతో గెలుపొందుతారని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు బలంగా మొగ్గు చూపుతున్నారని అన్నారు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ లలో అవకతవకలు ఉన్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే అవినీతిపై విచారణ జరిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డాక్టర్ గోపాలం విద్య సాగర్, అన్నే సత్యనారాయణ రావ్, ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యాసాగర్, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుజిత్ హజార్ తదితరులు పాల్గొన్నారు.