నెమ్లిలో ఆకట్టుకుంటున్న ఓటర్ల ఫ్లెక్సీ

by Sridhar Babu |
నెమ్లిలో ఆకట్టుకుంటున్న ఓటర్ల ఫ్లెక్సీ
X

దిశ, బాన్సువాడ : కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని నెమ్లి గ్రామంలో ఓటర్ల పేరుతో వెలిసిన ఫ్లెక్సీ వాట్సాప్ లో వైరల్ అవుతుంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వచ్చే రాజకీయ పార్టీలు, నాయకులను ఆలోచింపచేస్తుంది. ఉచిత పథకాలు, గ్యారెంటీలు ప్రకటించిన పార్టీలకు ఇది చెంపపెట్టు అని ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ ఫ్లెక్సీలో పనికిమాలిన ఉచిత పథకాలు వద్దని,

దేశ భద్రత కావాలని, దేశ భద్రత కోసం ఎన్ఏఏ, ఎన్ ఆర్ సీ అమలు చేయాలని, సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు, హిందూ ఆలయాల రక్షణ కోసం హిందూ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని, బలవంతపు మత మార్పిడి నిరోధక చట్టం కావాలని, అన్నదాతల ఆత్మహత్యలు లేని వ్యవసాయ విధానాలు రావాలని, గోవధ నిషేధ చట్టం తేవాలని రాసి ఉన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇలా అన్ని గ్రామాలలో ఓటర్లు ఐకమత్యమైతే చాలా బాగుండేదని వాట్సాప్ లలో పోస్ట్ లు చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Next Story